
అయితే ఉదయ్ కిరణ్ కెరియర్ లో చేసింది ఒకే ఒక్క తప్పు. ఫ్రెండ్షిప్ పేరుతో సినిమాలను ఓకే చేయడం . కధ బాగున్న బాగో లేకపోయినా ఫ్రెండ్ బాగుపడతాడు లే అన్న కారణంగా ఎన్నో సినిమాలను కమిట్ అయ్యాడు . కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. హిట్ అయిన సినిమాలకు రెమ్హ్యూనరేషన్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చేశారు. ఉదయ్ కిరణ్ నమ్ముకున్న వాళ్లు ఫ్రెండ్షిప్ అనే ముసుగులో మాయ చేసే మనుషులు . ఒకరు కాదు ఇద్దరు కాదు ఆయన కెరియర్లో దాదాపు మూడు సినిమాలు ఇలాగే హిట్ అయి రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన డైరెక్టర్ లు ప్రొడ్యూసర్స్ ఉన్నారు .
అయితే ఇప్పుడు అదే విధంగా మరొక సారి ఫ్రెండ్షిప్ పేరుతో మోసపోతున్నాడు తెలుగు స్టార్ హీరో అంటూ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . జనాలు ఇదే వార్తలను ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఈయన ఒక మంచి హీరో పెద్ద హీరో అని చెప్పలేము కానీ చాలా చాలా మంచి హీరో. ఎంతలా అంటే ఆయన సినిమాలకన్నా కూడా పక్క హీరో సినిమాలకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు . మంచితనానికి మరో మారుపేరు అనే చెప్పాలి . ఈ హీరో చాలా కష్టపడి స్వయంకృషితో పైకి ఎదిగాడు . అయితే ఈ హీరో టాలెంట్ చూసి కొంతమంది ఆయనను తొక్కేయడానికి కూడా ప్రయత్నించారు. మరీ ముఖ్యంగా నెపోటిజం అంటూ ఈ హీరో కెరియర్ ని తొక్కేయడానికి నానా విధాలుగా ట్రై చేశారు . కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఊరుకోలేదు . ఆయన నటించే సినిమాలు ఫ్లాప్ అవుతున్న సరే సూపర్ డూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ముందుకెళ్ళిపోయేలా చేశారు . అయితే ఇప్పుడు ఈ హీరో కూడా ఫ్రెండ్షిప్ పేరుతో డబ్బులు తీసుకోకుండానే సినిమా చేస్తున్నారట . అయితే ఇది ఎంతవరకు న్యాయమంటున్నారు ఫ్యాన్స్. ఆయనకి కొన్ని పర్సనల్ ఖర్చులు ఉంటాయని గతంలో ఉదయ్ కిరణ్ చేసిన తప్పు మాదిరి నువ్వు మాత్రం చేయకు అంటూ సజెషన్స్ ఇస్తున్నారు..!