
ఇప్పుడు ఆ అంచనాలను మరొక్క స్థాయికి మ్యాడ్ స్క్వేర్ టీజర్ తీసుకువెళ్లింది. విడుదలైన నిమిషాలలోనే సోషల్ మీడియాలో 10 మిలియన్స్ పైగా వ్యూస్ తీసుకు వచ్చిందట. ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజున హైదరాబాదులో ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర బృందం. అందులో ఈ చిత్రానికి సంబంధించి పలు విషయాలను పంచుకోవడం జరిగింది.. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ.. మ్యాడ్ సినిమాని ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేశారో.. మాడ్ స్క్వేర్ కూడా అంతకు పదిరెట్లు ఉంటుందని తెలియజేశారు. ప్రతి సన్నివేశం కూడా మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తుందని.. మార్చి 29న ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపారు.
అలాగే యంగ్ హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. టీజర్ చూసింది చాలా తక్కువే సినిమాలో అంతకుమించి ఉంటుంది అంటూ తెలిపారు. మ్యాడ్ స్క్వేర్ సినిమా మీరు ఊహించని దానికంటే ఎక్కువగానే ఉంటుందని వెల్లడించారు. మ్యాడ్ మూవీ రిలీజ్ అయిన సమయంలో నిర్మాత నాగ వంశి గారు ఒక మాట చెప్పారని.. సినిమా నచ్చకపోతే డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు.. ఇప్పుడు ఆయన మాటలను తాను చెబుతున్నానని ఎవరికైనా ఈ సినిమా నచ్చకపోతే.. టికెట్ కొన్న వాటికంటే డబుల్ ఇచ్చేస్తామంటూ తెలియజేశారు. మొత్తానికి ఈ యంగ్ హీరో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.