టాలీవుడ్‌ సీనియర్ స్టార్ హీరోలుగా చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒకప్పుడు నలుగురు స్టార్ హీరోస్ .. ఇండస్ట్రీలో ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇస్తూ వరుస సక్సెస్‌లు అందుకున్నారు. ఇలాంటి క్రమంలోనే మా హీరో గొప్ప అంటే .. మా హీరో గొప్ప అంటూ.. ఫ్యాన్ వార్‌లు కూడా తెగ‌ జరుగుతూ ఉండేవి. కానీ .. అభిమానులు ఎంతగా వార్ చేసుకున్న ఈ నలుగురు స్టార్ హీరోస్ మాత్రం ఒకరితో ఒకరు మంచి హెల్తీ బాండ్‌ కలిగి ఉండేవారు . ముఖ్యంగా చిరంజీవి , నాగార్జున మధ్యన ఎంత గ్రేట్ ఫ్రెండ్షిప్ ఉందో చెప్పనవసరం లేదు. ఇప్పటికి వారిద్దరి బాండింగ్ అలాగే కొనసాగుతుంది.


ఒకరి ఇంట్లో ఫంక్షన్లకు మరొకరు అటెండ్ కావడం , ఒకరి పర్సనల్ ఈవెంట్లలో మరొకరు సందడి చేయడం చూస్తూనే ఉన్నాం . ఇక అక్కినేని కింగ్ నాగార్జున .. తన సినీ కెరీర్‌లో ఎన్నో మల్టీ స్టార‌ర్ సినిమాల్లో మెరిసాడు . కృష్ణ , హరికృష్ణ , శ్రీకాంత్ లాంటి హీరోలతో నాగార్జున మల్టీస్టారర్‌లు నటించి సక్సెస్ అందుకున్నాడు . అయితే.. చిరుతో మాత్రం .. ఆయన ఒక్క మల్టీ స్టార‌ర్ సినిమా కూడా నటించలేదు . అయినా చిరు తో స్క్రీన్ షేర్ చేసుకోకున్నా .. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై చిరంజీవి ని హీరోగా పెట్టి ఓ సినిమాను తీయాలని భావించాడు . వెంటనే .. కె.రాఘవేంద్రరావు ను అప్రోచ్ అయ్యాడు.

 

ఇక రాఘవేంద్ర చెప్పిన కథ చిరంజీవికి , నాగార్జునకు ఇద్దరికి నచ్చడం తో వెంటనే సెట్స్ పైకి వచ్చేసింది . అప్పట్లో సినిమాలో హీరోయిన్గా సౌందర్యని తీసుకున్నారు . ఇద్ద‌రితో రెండు సాంగ్స్ కూడా పూర్తయ్యాయి . 10% టాకీ పార్ట్‌ కూడా ముగిసిన తర్వాత .. రాఘవేంద్రరావు ఎందుకో ఈ కథ చిరంజీవికి సెట్ అవ్వదు అని ఫీల్ వచ్చిందట. వెంటనే నాగార్జునను పిలిపించి సినిమా ఫ్లాప్ అవుతుంది .. చిరంజీవి కి అసలు సెట్ కాదని చెప్పేసాడట . దీంతో నాగార్జున సినిమాపై దర్శకుడుకే నమ్మకం లేకపోతే ఆపేయడమే మంచిదని చిరంజీవికి ఒపీనియన్ చెప్పాడు . వెంటనే చిరు కూడా దానికి అంగీకరించడం తో.. సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఈ సినిమా కోసం చిరంజీవి ఇచ్చిన 30 రోజుల డేట్స్ కూడా వేస్ట్ అయిపోయినా.. చిరు, నాగార్జున పై కొంచెం కూడా కోపం తెచ్చుకోలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: