బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ షో సీజన్ వన్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. సీజన్ వన్ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఈ షో నుంచి హోస్ట్ గా తప్పుకోవడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 2 కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా పని చేశారు. అయితే వేరు వేరు కారణాల వల్ల నాని సైతం ఈ షో నుంచి తప్పుకోవడం జరిగింది.
 
బిగ్ బాస్ షో సీజన్ 3 నుంచి సీజన్ 8 వరకు ఫలితాలతో సంబంధం లేకుండా నాగార్జున ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నాగార్జునకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండటం కూడా ఈ హీరోకు అన్ని విధాలుగా ప్లస్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బిగ్ బాస్ సీజన్ 8 ఆశించిన స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకోలేదు. కంటెస్టెంట్ల ఎంపికలో పొరపాట్లతో పాటు బిగ్ బాస్ షో నిర్వాహకులు చేసిన కొన్ని తప్పులు ఈ షోకు మైనస్ అయ్యాయి. అయితే బిగ్ బాస్ షో సీజన్ 9 కు మాత్రం విజయ్ దేవరకొండ హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.
 
అయితే ఈ తరహా వార్తలు ప్రచారంలోకి రావడం కొత్తేం కాదు. గతంలో కూడా బిగ్బాస్ షో హోస్ట్ మారతారని వార్తలు వినిపించాయి. బిగ్ బాస్ సీజన్ 9 విషయంలో వైరల్ అవుతున్న వార్తలు నిజమవుతాయో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తే మాత్రం ఈ షో రేటింగ్స్ ఊహించని స్థాయిలో పెరగడం పక్కా అని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: