
ఇంతకీ ఆ మూవీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 1987 సెప్టెంబర్ 7న బాలయ్య హీరోగా తెరకెక్కిన మంగమ్మగారి మనవడు. మొదట ఈ సినిమా కోసం కోదండరామిరెడ్డి చిరంజీవిని అప్రోచ్ అయ్యారట కోదండరామిరెడ్డి . కథ మొత్తం వినిపించిన తర్వాత చిరంజీవి ఆసక్తిగా లేదంటూ సినిమాను రిజెక్ట్ చేశాడు. వెంటనే బాలకృష్ణకు ఇదే కథ వినిపించి ఆయనతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడు కోదండరామిరెడ్డి. ఇక ఈ మూవీ రిలీజై అప్పట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసింది. సుహాసిని హీరోయిన్‌గా, భానుమతి రామకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, రావి కొండలరావు, టెలిఫోన్ సత్యనారాయణ తదితరులు కీలకపాత్రలో నటించిన ఈ సినిమాకు భారతీయ రాజ కథ అందించగా.. కేవీ మహదేవన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు.
భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే సోలోగా నటించి.. వంద రోజులు ఆడిన తొలి సినిమాగా సంచలనం సృష్టించింది. అంతేకాదు.. బాలయ్యను ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా కూడా ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. కర్ణాటకలో వంద రోజులు ఆడిన సినిమా హైదరాబాదులో 565 రోజులు కంటిన్యూస్గా ప్రదర్శించబడింది. అప్పట్లో హైయెస్ట్ రన్ టైం సాధించిన సినిమాగా సంచలనం సృష్టించింది. అలాంటి సినిమాను చిరంజీవి రిజెక్ట్ చేయడం ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరిచినా.. అదే ఏడాది చిరంజీవి ఛాలెంజ్ సినిమాతో హిట్ కొట్టి మంచి ట్రీట్ ఇచ్చాడు.