సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, నటులు ఆర్థికపరమైన నేరాలు, మోసాలు, వివాదాల్లో చిక్కుకుంటూ ఉండేవారు. అలా కేవలం హీరోల పేర్లు మాత్రమే వినిపించేవి. కానీ ఇప్పుడు అలాంటి వివాదాల్లో హీరోయిన్ల పేర్లే ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. తమన్న, కాజల్, జాక్వాలిన్ ఫెర‌క్నాండేజ్‌.. ఇలా వరుసగా చాలామంది హీరోయిన్లు ఫైనాన్షియల్ ఇష్యులలో చిక్కుకుంటున్నారు. పాండిచ్చేరి పోలీసులు ఇప్పటికే హీరోయిన్ తమన్న, కాజల్లకు నోటీసులు అందించారు. ఫైనాన్షియల్ చీటింగ్ కేసులో ఇద్దరు విచారణను ఎదుర్కొంటున్నారు. 2022లో కోయంబత్తూర్ లోని ఓ కంపెనీ ఓపెనింగ్ ఈవెంట్ లో తమన్న, తర్వాత మహాబలిపురంలో జరిగిన ఈవెంట్లు కాజల్ పాల్గొని సంద‌డి చేశారు. ఇలా హీరోయిన్లను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టి అరవింద్ కుమార్,నితీష్ జైన్‌ ఫైనాన్షియల్ లాభాలను దక్కించుకున్నారు.


ఈ క్రమంలోని పదిమంది నుంచి రూ.2 కోట్లు 40 లక్షల వరకు చీటింగ్ జరిగినట్లు ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో.. నితీష్, అరవిందులను అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి కాజల్, తమన్న కూడా ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక ఫైనాన్షియల్ చీటింగ్ అనగానే టక్కున గుర్తొచ్చే హీరోయిన్ జాక్వలిన్‌. ఇప్పటికే ఆర్ధీక మోస‌గాడు సుకేష్ చంద్రశేఖర్ నుంచి ఈమె భారీగా లబ్ధి పొందిందని స‌మాచారం. ఇటీవల ప్రేమికుల రోజు కానుకగా ఈమెకు ఏకంగా ప్రవేట్ జట్ను సుఖేష్ బహుమతిగా ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఈడీ విచారణలో హాజరై ఈ కేసులో లోతుగా కూరుకుపోయింది జాక్వెలిన్. ఇక ఈ కేసులోనే మరో హీరోయిన్ నౌరా ఫతేహీ కూడా ఇరుక్కుంది. సుకేష్ కు చెందిన రూ.250 కోట్ల అవకతవకలకు సంబంధించిన కీలక సాక్షిగా.. ఢిల్లీలో పటియాల హౌస్ కోర్టు ముందు వాంగ్మూలాన్ని ఇచ్చింది.


జాక్వలిన్ రేంజ్ కాకున్న‌ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ ఫైనాన్షియల్ మోసాలు, నేరాలు, వివాదాల్లో చెప్పుకొని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేశాన్ని కుదిపేసిన మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్ల పేర్లు ఈ వివాదాల్లో వినిపిస్తున్నాయి. వాళ్లలో శ్రద్ధా కపూర్,  తమన్న, హోమా ఖురేషి, హీనా ఖాన్ ఈడీ విచారణలు ఎదుర్కున్నారు. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లింక్ అయినా మనీ లాండ్రింగ్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ విచారణ ఎదుర్కొంటుంది. ఇప్పటికే రెండుసార్లు ఈడి ఆమెకు నోటీసులు అందించగా.. నాలుగేళ్ల కిందటి ఈ కేసు విషయంలో ఇప్పటికీ రకుల్ పేరు నలుగుతూనే ఉంది.  వీళ్ళతో పాటు మల్యాల హీరోయిన్ ధనియా మేరీ వర్గీస్‌, బాలీవుడ్ హీరోయిన్ శిల్ప శెట్టిల పేర్లుకూడా ఈ వివాదాల్లో వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: