
అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకు రజనీకాంత్ కు ఓ లింక్ ఉందన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు . ఇంతకి ఆ లింక్ ఏంటో.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. కోలీవుడ్ స్టార్ హీరోగా రజనీకాంత్ ఏడుపదుల వయసులోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే . తన స్టైల్, ఆటిట్యూడ్ తో లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకున్న రజిని .. తెలుగులోనే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. కాగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల రజనీకాంత్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు . శ్రీకాంత్ అడ్డాల మొదట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు , వెంకటేష్ లకు తండ్రి పాత్ర కోసం రజనీకాంత్ అయితే బాగుంటుందని భావించాడట.
ఈ క్రమంలోనే చెన్నైకి వెళ్లి మరి రజనీకాంత్ కు కథ వినిపించాడట. అయితే కథ విన్న రజినీకాంత్ .. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగోలేదని .. ఇప్పుడైతే నటించలేనంటూ చెప్పుకొచ్చాడట . దీంతో చేసేదేమీ లేక వెనుతిరిగిన శ్రీకాంత్ .. ప్రకాష్ రాజ్ వద్దకు వెళ్లి కథను వినిపించడం తో ఆయన వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . ఇదే విషయాన్ని శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొస్తూ.. ఇక తన లైఫ్ లో రజనీకాంత్ కు కథ చెప్పిన టైం ఎంతో స్పెషల్ అని.. ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ వివరించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్‌గా మారడం తో.. ప్రకాష్ రాజ్ రోల్ రజనీకాంత్ చేయవలసిందా అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.