
ఈ క్రమంలోనే ప్రస్తుతం ది రాజా సాబ్, స్పిరిట్, కల్కి 2, సలార్ 2లతో పాటు.. హనురాగపూడి డైరెక్షన్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిజీ లైనప్‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రిటీలు, హీరోలు సైతం ప్రభాస్‌తో కలిసి నటించే ఛాన్స్ వస్తే బాగుంటుందని అభి ప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ప్రభాస్.. ఓ టాలీవుడ్ హీరో అంటే చాలా భయమని.. ఆయనను చూస్తేనే వణికిపోతాడు అంటూ న్యూస్ తెగ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. మంచు మోహన్ బాబు. ఎస్.. మీరు వినది కరెక్టే. మంచు మోహన్ బాబు అంటే.. ప్రభాస్‌కు చాలా భయమట. ఈ విషయాన్ని స్వయంగా మంచు మనోజ్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఆయన మాట్లాడుతూ.. నాన్నగారు అంటే ప్రభాస్ వణికిపోతారని .. కన్నప్ప కోసం ప్రభాస్‌కు నాన్నగారే ఫోన్ చేసి అడిగారని .. అప్పటికే వణికిపోతున్న ప్రభస్.. వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా నాన్నకు సరే అని చెప్పేసాడంటూ వివరించాడు . ఇక ఆయన ఫోన్ కట్ చేసిన కొంతసేపటి.. ప్రభాస్ నాకు కాల్.. చేసి ఏదైనా ఉంటే నాతో డైరెక్ట్‌గా కాల్ చేసి చెప్పు.. ఆయన వరకు వెళ్ళనివ్వకని అన్నాడని.. నాన్నగారు అంటే ప్రభాస్‌కు అంత భయం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్‌కు తన పెదనాన్న కృష్ణంరాజు అంటే కూడా మొదటి నుంచి చాలా భయమట. ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో సరదాగా ఆయనతో మాట్లాడినా.. ఏదైనా విషయం చెప్పాలంటే చాలా మొహమాటపడేవాడట. ప్రస్తుతం ఈ విషయాలు నెటింట వైరల్ అవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.