
ఆయన చనిపోయేంత వరకు కూడా ఆ కండిషన్ తప్పలేదు. తను బ్రతికున్నంత వరకు ప్రజల దృష్టిలో హీరో గానే ఉండాలని.. శోభన్ బాబు వయసు మీద పడిన తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. హీరోల తండ్రి పాత్రలో అవకాశాలు వచ్చిన, కోట్లు ఆఫర్ చేసిన రిజెక్ట్ చేశాడు. నేను అలా కనిపిస్తే నా అభిమానులు యాక్సెప్ట్ చేయలేరని ఉద్దేశంతోనే ఆయన ఇలాంటి కండిషన్‌ను పెట్టుకున్నారు. అయితే శోభన్ బాబు తన సినీ కెరీర్‌లో ఎంతమంది స్టార్ హీరోయిన్స్ తో చిందేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయసుధ, జయప్రద, మాధవి, శ్రీదేవి, రాధ, విజయశాంతి లాంటి స్టార్ హీరోయిన్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
అయితే ఆయన సినీ కెరీర్‌లో ఎంతమందితో నటించినా.. ఒక్క హీరోయిన్‌ను మాత్రం చాలా స్పెషల్గా అత్త అంటూ ఆటపట్టించే వాడట. ఆమె మరెవరో కాదు.. జయప్రద. స్వయంగా ఈ విషయాన్ని జయప్రద ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆయనకు నేనంటే మొదటి నుంచి చాలా అభిమానం అని.. సెట్స్ లో కూడా అత్తా అత్తా అంటూ నన్ను పిలిచేవాడు అంటూ జయసుధ హోస్ట్‌గా వ్యవహరించిన ఇంటర్వ్యూలో జయప్రద షేర్ చేసుకుంది. ఇక తన 60 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిన శోభన్ బాబు.. ఆ తర్వాత తన నుంచి ఒక ఫోటో కూడా బయటకు రాకుండా.. ఎలాంటి ఇంటర్వ్యూలో హాజరు కాకుండా.. దూరంగానే ఉన్నారు. నటనతో పాటు.. బిజినెస్ రంగంలోనూ రాణించిన ఆయన.. రియల్ ఎస్టేట్‌లో కోట్లు సంపాదించారు. ఇక తన 71 ఏళ్ల వయసులో గుండెపోటుతో శోభన్ బాబు తుదిశ్వాస విడిచారు.