
ఇందులో మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తూ ఉన్నారు. అలాగే ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, మోహన్లాల్ ,మోహన్ బాబు, శరత్ కుమార్, మధుబాల వంటి సీనియర్ నటీనటులు సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కన్నప్ప సినిమా నుంచి విడుదలైన ఒక్కొక్క పోస్టర్ కూడా ఎవరెవరు ఎలాంటి పాత్రలో నటిస్తున్నారో తెలియజేయడం జరిగింది మేకర్స్.. ఇక రీసెంట్ గా టీజర్ ఫస్ట్ లుక్ వంటి ప్రమోషన్స్ తో ఈ సినిమా పైన అంచనాలను పెంచేస్తున్నాయి.
తాజాగా విడుదలైన టీజర్ విషయానికే వస్తే.. గూడాల మీద దండాలు దండెత్తుకొస్తున్నాయి అనే డైలాగ్ తో మొదలవుతుంది.. ఆ తరువాత విజువల్ వండర్స్ తో బాగానే ఆకట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఇక మోహన్ బాబు కూడా ఇందులో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నారు. మంచు విష్ణు చెప్పే డైలాగులు కూడా కొంతమేరకు బాగానే ఆకట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇక చివరిలో శివయ్య పాత్రలో ప్రభాస్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు.. సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో కన్నప్ప సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఏప్రిల్ 25న ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది కన్నప్ప. మరి ఏ మేరకు అభిమానులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇప్పటికే శివ శంకర అనే పాట కూడా విడుదలే ఈ సినిమాకి ప్లస్గా మారింది.