సినిమా ఇండస్ట్రీ లో ఒకే రోజు రెండు క్రేజీ సినిమాలు పోటీ పడకుండా నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం రెండు మంచి క్రేజ్ ఉన్న సినిమాలు ఒకే రోజు విడుదల అయినట్లయితే ఏదో ఒక సినిమాకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దానితో ఖచ్చితంగా రెండు క్రేజీ సినిమాల మధ్య ఎంతో కొంత గ్యాప్ ఉండేలా నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక అదే ఒక నిర్మాణ సంస్థ రూపొందించిన రెండు క్రేజీ సినిమాలను ఒకే రోజు విడుదల చేయడం అనేది అనేది అత్యంత తక్కువ సందర్భాలలో మాత్రమే జరుగుతుంది.

ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న ఓ నిర్మాణ సంస్థ తాము నిర్మించిన ఓ రెండు సినిమాలను ఒకే రోజు విడుదల చేయాలి అననే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో మైత్రి సంస్థ ఒకటి. ఈ సంస్థ వారు ప్రస్తుతం సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో జాట్ అనే హిందీ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు లో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ నిర్మాణ సంస్థ వారు తమిళ నటుడు అజిత్ కుమార్ హీరోగా అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇకపోతే ఈ రెండు క్రేజీ సినిమాలను ఏప్రిల్ 10 వ తేదీన మైత్రి సంస్థ వారు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలా ఈ బ్యానర్ వారు నిర్మించిన రెండు క్రేజీ సినిమాలను ఒకే రోజు విడుదల చేసే ఆలోచనలో ఈ సంస్థ వారు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాలను మైత్రి సంస్థ వారు ఒకే రోజు విడుదల చేస్తారా ..? లేక విడుదల తేదీలలో ఏదైనా మార్పు చేస్తారా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజుల వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: