తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది లెజెండ్ యాక్టర్స్ ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. వీరే కాకుండా చాలామంది నటీనటులు సైతం తెలుగు సినీ ఇండస్ట్రీ ఎదగడానికి ప్రోత్సాహం చేశారని చెప్పవచ్చు. అయితే వీరి మధ్య ఎంత స్నేహం ఉండేదో అంతే కాంట్రవర్సీ ఎక్కువగా నడుస్తూ ఉండేదట. మీరు ఒకానొక సమయంలో వరుస వివాదాల వల్ల శత్రువులుగా మారిన పరిస్థితి ఏర్పడిందనే  విదంగా గతంలో వార్తలు వినిపించేవి. ఈ ఇద్దరు హీరోలు కూడా ఏ విషయంలో కూడా తగ్గేవారు కాదని.. ఇలాంటి హీరోల మధ్య ఒక టైటిల్ వార్ జరిగిందట.



అటు కృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా వీరి మధ్య ఎప్పుడు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉండేదట. అయితే ఇద్దరి వారసులను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఇద్దరు వారసులు  ఒకే టైటిల్ విషయంలో ఒక పెద్ద గొడవ కూడా జరిగిందట. ఎవరు కూడా తమ టైటిల్ని మార్చుకోవడానికి పెద్దగా మక్కువ చూపలేదట సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబుని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సమయంలో సామ్రాట్ సినిమాని మొదలుపెట్టారట కృష్ణ. బాలీవుడ్ లో హిట్ అయిన బేతాబ్ సినిమాని తెలుగులో రీమిక్స్ చేయడం మొదలుపెట్టారు.


ఇదే టైటిల్ తో బాలకృష్ణ హీరోగా నిర్మాత కేసి శేఖర్ బాబు సామ్రాట్ అనే ఒక టైలిల్తో సినిమాని తీయడం జరిగింది. అయితే ఈ టైటిల్ని కృష్ణ ముందే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మార్చడానికి నిర్మాత శేఖర్ బాబు కూడా అసలు ఒప్పుకోలేదట. దీంతో సీనియర్ ఎన్టీఆర్ కూడా తన కొడుకు కోసం రంగంలోకి దిగారు.. ముఖ్యంగా తన కుమారుడికి సామ్రాట్ సినిమా టైటిల్స్ ఇవ్వాలని పట్టు పట్టారట. అయితే ఈ రెండు సినిమాలు సామ్రాట్ అనే ఒక టైటిల్తోనే ప్రమోషన్స్ చేశారట. అయితే ఈ వివాదం పెద్దదవ్వడంతో సినీ ఇండస్ట్రీ వారు భయపడి.. సర్ది చెప్పేందుకు వెళ్లారట.. అయితే కృష్ణసినిమా టైటిల్ ని ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో బాలయ్య సినిమాకు సహస్త్ర సామ్రాట్ గా మార్చుకున్నారట. కానీ ఈ రెండు సినిమాలు భారీ డిజాస్టర్ గా మిగిలిపోయాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: