గత రెండు మూడు రోజుల నుంచి హీరోయిన్ తమన్నా, కాజల్ అగర్వాల్ పైన క్రిస్టో కరెన్సీ మోసం కేసులో చిక్కుకుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జనాలను మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు అందిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు పదిమంది నుంచి 2.40 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారని విధంగా వార్తలు వినిపించాయి. అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారని 2022లో కోయంబత్తూరు మెయిన్ బ్రాంచ్ కార్యక్రమంలో హీరోయిన్ తమన్నా పాల్గొన్నప్పుడు తమన్నా పేరు కూడా వినిపించింది. అలాగే కాజల్ అగర్వాల్ పేరు కూడా వినిపించింది.


అయితే తాజాగా ఈ క్రిష్టో కరెన్సీ వ్యవహారం పైన హీరోయిన్ తమన్నా స్పందిస్తూ ఈ వార్తలన్నీ కూడా పూర్తిగా అవాస్తవం అంటూ ఆమె తెలియజేసింది. ఇలాంటి వార్తల పైన తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించిన తమన్నా క్రిష్టో కరెన్సీ సంబంధిత కార్యకలాపాలలో తన ప్రమేయం గురించి కేవలం రూమర్స్ సృష్టిస్తున్నారని ఆ విషయం తన వద్దకు వచ్చిందని మీడియా కూడా ఇలాంటి నకిలీ తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేయవద్దండి అంటూ తెలియజేసింది.

ఇలాంటి తప్పుడు వార్తలను వైరల్ చేసే వారికి తగిన చర్యలు తీసుకుంటాను అంటూ ఖచ్చితమైన వార్నింగ్ ఇచ్చింది తమన్నా. అందుకు సంబంధించి తన టీం కూడా ఇప్పటికే దర్యాప్తు వేగవంతం చేస్తోంది అంటూ తెలిపింది. లాభాలను చూపించి జనాలను మోసం చేస్తున్నారని విషయం పైన ఇప్పటికే నితీష్ జై ఇన్, అరవింద్ కుమార్లను అరెస్టు చేశారు. ఆ తర్వాతే తమన్నా ,కాజల్ అగర్వాల్ ను కూడా విచారించేందుకు పొందుచేరి పోలీసులు ఒక నిర్ణయం తీసుకున్నారనే విధంగా వార్తలు వినిపించాయి. మరి ఈ విషయం పైన తమన్నా స్పందించగా అది కాజల్ అగర్వాల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: