తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచు మోహన్ బాబు గురించి, ఆయన ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీలో కొన్నిరోజుల ముందు వరకు గొడవలు జరిగాయి. ఈ మధ్య కాస్త శాంతించినట్లు ఉన్నారు. మరోవైపు తన కొత్త సినిమా కన్నప్ప కోసం విష్ణు ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు.ఈ సందర్భంగా మంచు విష్ణు  సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.కొందరు ఆయన సినిమా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా కొందరు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. తమ్ముడు మనోజ్ తో గొడవ గురించి స్వయంగా విష్ణునే అడిగాడు. దీనికి విష్ణు కూడా చాలా చాకచక్యంగా సమాధానం చెప్పాడు.కొన్నిరోజుల క్రితం మంచు మనోజ్ తన ఇంట్లో ఉండగా.. విష్ణు, అతడి మనుషులు వెళ్లి జనరేటర్ లో పంచదార పోశారని అంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిజంగా అక్కడేం జరిగిందనేది పక్కనబెడితే అసలు జనరేటర్ లో షుగర్ ఎందుకు పోశావ్ అన్నా? అని స్వయంగా విష్ణుని ఓ నెటిజన్ అడిగేశాడు.ఆస్క్ విష్ణు పేరుతో సోషల్ మీడియా లో జరిగిన చాటింగ్ సందర్బంగా ఇదంతా జరిగింది. అయితే ఏం చెప్పినా సరే మళ్లీ వివాదం అయ్యే అవకాశముంది కాబట్టి విష్ణు తనదైన శైలిలో స్పందించారు. నిన్ను ఏమన్నా మాకు సమాధానం ఇచ్చిన మంచి మనసు నీది. మరి ఆ రోజు జనరేటర్‌లో షుగర్‌ ఎందుకు వేశావ్‌ అన్నా అని అడిగితే ఇంధనంలో పంచదార కలిపితే మైలేజ్‌ పెరుగుతుందని చదివా అని విష్ణు సమాధానమిచ్చారు.తన ఇంటి వద్ద జనరేటర్‌లో పంచదార పోయించి, విద్యుత్తు సరఫరాను విష్ణు నిలిపివేశారంటూ కొన్ని రోజుల క్రితం మనోజ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన గురించే నెటిజన్‌ ప్రశ్నించారు.ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇదిలావుండగా భక్త కన్నప్ప స్టోరీతో తీసిన 'కన్నప్ప' మూవీలో విష్ణు ప్రధాన పాత్రధారి కాగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ అతిథి పాత్రలు పోషించడం విశేషం. ఏప్రిల్ 25న ఇది థియేటర్లలోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: