ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఓ టీ టీ లోకి అనేక సినిమాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇక ఈ వారం చాలా సినిమాలు ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వనున్న అందులో ఓ రెండు సినిమాలపై మాత్రం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలా ఆ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడానికి ప్రధాన కారణం ఆ రెండు మూవీ లు స్టార్ హీరోలు నటించినవి కావడం. మరి ఆ హీరోలు ఎవరు ..? ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా మార్చి 1 వ తేదీన అనగా ఈ రోజు నుండి జీ 5 ఓ టి టి లో తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తమిళ నటుడు అజిత్ కుమార్ తాజాగా విడ మూయర్చి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది.

మూవీ ని ఈ వారం తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమాని తెలుగులో పట్టుదల అనే పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ కి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రాలేదు. ఇలా ఈ వారం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ , కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోలుగా రూపొందిన సినిమాలు ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: