ఏంటి ఆ హీరోయిన్ అందం సీక్రెట్ పేడనా.. మొహానికి రోజు వేడివేడి పేడ పూసుకుంటుందా? ఇంతకీ పేడ పూసుకునే ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. చాలామంది హీరోయిన్లు పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా తమ అందాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఫిట్నెస్ ని అలాగే మెయింటైన్ చేస్తూ ఇప్పటికి కూడా పాతికేళ్ల అమ్మాయిలాగే కనిపిస్తూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో సీనియర్ నటి లైలా కూడా ఒకరు. ఒకప్పుడు ఎగిరే పావురమా సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకున్న లైలా ఎక్కువగా తమిళ,కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ అయింది. అయితే తెలుగులో కూడా ఈ హీరోయిన్ కి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ గా ఉంది.అయితే అలాంటి ఈ హీరోయిన్ మళ్లీ ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.

 పెళ్ళై పిల్లలు పుట్టాక ఆది పినిశెట్టి మూవీ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది.ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న శబ్దం మూవీలో లైలా కీ రోల్ పోషిస్తుంది.. ఇక ఈ మూవీ ఈవెంట్లో భాగంగా చాలామంది లైలాను చూసినవాళ్లు షాక్ అయిపోతున్నారు.ఎందుకంటే పెళ్ళై ఆమె ఎత్తున పిల్లలు ఉన్నా కూడా ఎందుకు లైలా ఇంకా అలాగే తరిగిపోని అందంతో ఉంటుంది అని చాలామందికి అనుమానాలు వస్తున్నాయి.

అయితే ఓ ఈవెంట్లో మీ అందం వెనుక ఉన్న రహస్యం ఏంటి అని అడగగా నేను రోజు నా మొహానికి వేడివేడి పేడ పూసుకుంటాను.అందుకే నేను ఇంకా ఇలాగే యంగ్ గా కనిపిస్తున్నాను అని చెప్పింది.ఇక హీరోయిన్ నా అందం వెనుక ఉన్న సీక్రెట్ పేడనే అంటూ మాట్లాడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వేశారు.ఇకనైనా తెలుగులో పెళ్లి చేసుకుందాం,పవిత్ర ప్రేమ, మిస్టర్ అండ్ మిసెస్ శైలజ కృష్ణమూర్తి  వంటి సినిమాల్లో నటించింది.అలాగే గత ఏడాది వచ్చిన ది గోట్ మూవీలో కూడా లైలా కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: