చాలామంది హీరోల విషయంలో పెళ్లికి ముందు సినిమాల్లోకి వచ్చిన సమయంలో ఎంతో మంది హీరోయిన్లతో ప్రేమలో పడ్డారని, సింగర్స్ తో ప్రేమలో పడ్డారని ఇలా ఎన్నో రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇప్పటి జనరేషన్ హీరో హీరోయిన్లు మాత్రమే కాదు సీనియర్ హీరో హీరోయిన్ల విషయంలో కూడా ఈ వార్తలు చాలానే వినిపించాయి. అలా రజినీకాంత్ విషయంలో కూడా వినిపించింది.అదేంటంటే రజినీకాంత్ ఒక స్టార్ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించారట. ఆ హీరోయిన్ కి తన లవ్ ప్రపోజ్ చేద్దామని ఇంటికి కూడా వెళ్లారట. కానీ చివరికి అది జరగలేదట.మరి ఇంతకీ రజినీకాంత్ అంత గాఢంగా ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే శ్రీదేవి.. 

అవును గతంలో రజినీకాంత్ శ్రీదేవి మధ్య ఏదో జరిగింది.వీరిద్దరి మధ్య సంథింగ్ ఏదో నడుస్తుంది అని చాలామంది మాట్లాడుకున్నారు.కానీ వాళ్ళిద్దరి పెళ్లి జరగలేదు. అయితే రజినీకాంత్ తో  ఓ రోజు శ్రీదేవికి తన లవ్ ప్రపోజ్ చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్లారట. ఆరోజు శ్రీదేవి గృహప్రవేశం చేయడంతో రజినీకాంత్ ని గెస్ట్ గా పిలిచిందట.దాంతో రజినీకాంత్ ఆ గృహప్రవేశ ఈవెంట్లోనే తన ప్రేమ విషయాన్ని శ్రీదేవికి చెప్పాలి అనుకున్నారట.అలా ఆరోజు రాత్రి శ్రీదేవి ఇంట్లో ఫంక్షన్ కి కే.బాలచందర్ తో కలిసి రజినీకాంత్ వెళ్లారట.

అయితే ఆరోజు రాత్రి శ్రీదేవికి తన ప్రేమ విషయం బయట పెడదాం అనుకున్న సమయంలో సడెన్ గా కరెంటు పోవడంతో అపశకునంగా భావించిన రజినీకాంత్ ప్రేమ విషయాన్ని చెప్పకుండా అక్కడితో ఆపేద్దాం అని అనుకున్నారట.ఇక తర్వాత శ్రీదేవిని రజినీకాంత్ ఒక బెస్ట్ ఫ్రెండ్ గా భావించి చాలా రోజులు తమ మధ్య ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేశారు.ఇక శ్రీదేవి రజినీకాంత్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా ఆయన హాస్పిటల్ లో చేరితే ఉపవాసం ఉన్న సంగతి కూడా మనకు తెలిసిందే.అయితే ఈ విషయం మొత్తం కే బాలచందర్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: