
అయితే బాలకృష్ణ బ్రాహ్మణి ని మాత్రమే కాదు తేజస్విని ని కూడా మొదట ఓ హీరోకి ఇవ్వాలి అని అనుకున్నారట. తన చిన్న కూతుర్ని ఆ హీరోకి ఇచ్చి ఆ హీరో తండ్రితో వియ్యం అందుకోవాలని అనుకున్నారట.కానీ అది ఆదిలోనే అంతమైందట. ఇక విషయం ఏమిటంటే.. బాలకృష్ణ తన చిన్న కూతురు తేజస్వినిని అక్కినేని నాగేశ్వర రావు మనవడు అక్కినేని నాగచైతన్యకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారట.అయితే నాగేశ్వరరావుకి బాలకృష్ణకి మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకే తన కూతుర్ని నాగచైతన్యకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట.
కానీ అప్పటికే సమంతతో ప్రేమలో ఉన్న విషయం తెలిసి బాలకృష్ణ సైలెంట్ అయ్యారట.ఒకవేళ వీరి పెళ్లి జరిగితే బాలకృష్ణ నాగార్జున ఇద్దరు వియ్యంకులుగా మారేవారు.ఇండస్ట్రీలో అందరూ కలిసిపోయి ఉండేవారు. కానీ వీరి పెళ్లి జరగకపోవడంతో వీరిద్దరూ కలవలేదు. గతంలో కూడా వీరి మధ్య ఉన్న గొడవల కారణంగా వీరి మధ్య ఇప్పటికి మాటల్లేవు. కానీ ఈ విషయం తెలిసిన నెటిజన్స్ నాగచైతన్య తేజస్విని పెళ్లి జరిగితే బాగుండు బాలకృష్ణ నాగార్జున వియ్యంకులు అయ్యేవారు అంటూ కామెంట్లు పెడుతున్నారు