సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్రష్మిక మందన్న జంటగా నటించిన ‘యానిమల్’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఈ ఏడాది యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమా పై పలు విమర్శలు వచ్చినా.. సినిమా పెద్ద సంఖ్యలో జనాలకు నచ్చిందనడానికి బాక్సాఫీస్ కలెక్షన్లే నిదర్శనం. ‘యానిమల్’ సినిమాలో ఎక్కువ హింస, స్త్రీలను అగౌరవపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని అదేవిధంగా మహిళలపై హింసను ప్రోత్సహిస్తోందని పలు విమర్శలు వచ్చాయి.ఇక యానిమల్ సినిమాలో హై ఇచ్చిన ఎపిసోడ్‌లో బాబీ డియోల్ ఎంట్రీ ఒకటి. వాళ్ల ఇంట్లో మూడో పెళ్లి చేసుకుంటున్నట్లుగా ఆయన రోల్‌ను పరిచయం చేశారు. ఆ సమయంలో చిన్న పిల్లల వాయిస్ తో ఒక పాట ప్లే అవుతుంది బ్యాగ్రౌండ్లో. ఆ బిట్ సాంగ్ లెంగ్త్ తక్కువే కానీ దాని ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే ఉంది ప్రేక్షకులపై.ఇక సినిమాలో బాబీ డియోల్ స్క్రీన్ టైమ్ తక్కువే ఉన్నా.. ఇంపాక్ట్ మాత్రం బాగానే ఉంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ ఫైట్ మాత్రం వేరే లెవల్లో ఉంది.ఇదిలావుండగా సినిమాలో కనిపించేది పరిమిత సన్నివేశాల్లోనే అయినా కానీ బాబి డియోల్ అబ్రార్ పాత్రను పరాకాష్టకు చేర్చాడు. అయితే ఆ పాత్రను తీర్చిదిద్దిన సందీప్ వంగాకే ఆ క్రెడిట్ దక్కుతుంది.అసలు అబ్రార్ పాత్రను అలా మూగ వాడిగా ఎలా తీర్చిదిద్దారు? అన్నదానికి సందీప్ వివరణ ఇచ్చారు.

ఓ షోలో కనిపించిన సందీప్ వంగా ఇలా అన్నాడు.హీరో-విలన్ ఫోన్ తీసుకొని ఒకరినొకరు తిట్టుకుంటూ లేదా పంచ్ లు విసురుకుంటూ కనిపించే చాలా చిత్రాలను మనం చూశాము. సినిమా అంతటా ఏదో ఒక రకమైన డైలాగ్ తో భజంత్రీ ఉంటుంది. హీరో విలన్ ఫేసాఫ్ ఉంటుంది.ఈ సినిమా మొదటి అర్ధభాగం రణబీర్ కపూర్ పాత్రను, డియోల్ పాత్ర ప్రవేశించే ముందు తన తండ్రిపై అతడి ప్రేమను చూపించడంపైనే ఉంటుంది. ఆ తర్వాత అబ్రార్ (బాబి) పాత్ర ప్రవేశిస్తుంది. సహజంగా మన సినిమాల్లో విలన్లు భీభత్సమైన సంభాషణలు చెప్పడం చాలా చూశాము కాబట్టి, నేను అతన్ని మూగ - చెవిటి వ్యక్తిగా చూపించాలని అనుకున్నాను. క్లైమాక్స్‌లో చెవిటి, మూగ వ్యక్తి పోరాడటం అనే ఆలోచన చాలా ఎగ్జయిట్ చేసే ఆలోచన అని వివరణ ఇచ్చాడు.యానిమల్ లో ఆఫర్ తో బాబి డియోల్ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. అతడికి వరుసగా దక్షిణాదిన భారీ ఆఫర్లు దక్కాయి. ముఖ్యంగా అతడి నటనను కీర్తించని వారు లేరు. ఇదిలావుండగా రణ్‌బీర్ కపూర్, రష్మిక, బాబీ డియోల్ వంటి నటీనటుల నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్ సీన్స్ తప్ప ‘యానిమల్’ మూవీకి సగటు భారత సినీ ప్రియులకు మింగుడు పడని విషయాలు ఎన్నో ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ అని గొప్పగా చెప్పుకున్నా, కొన్ని విషయాలను తెర మీద చూపించకపోవడమే సభ్యత. దాన్ని ‘యానిమల్’ నిజంగానే బ్రేక్ చేసింది. అదీకాకుండా పురుషాహంకారంతో కొట్టుకునే ఓ బిలియనీర్ వారసుడిగా రణ్‌బీర్ కపూర్‌ క్యారెక్టర్‌ని చూపించిన విధానం, నేటి యువతపై తీవ్రంగా ప్రభావం చూపించొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: