ఈ మధ్యకాలంలో కొరియోగ్రాఫర్స్, డాన్స్ కంటెస్టెంట్, అలాగే చాలామంది యూట్యూబర్స్ గురించి ఎన్నో సంఘటనలు వింటూనే ఉన్నాము. అయితే ఇప్పుడు తాజాగా ఢీ షో కంటెస్టెంట్ గురించి ఒక యువతిని మోసం చేసే ఆత్మహత్య చేసుకునేలా చేశారనే విధంగా ఆ యువతి ఒక వీడియోని సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది.  దీనితో ఒక్కసారిగా ఈ వీడియో సినీ ఇండస్ట్రీలోనే వైరల్ గా మారుతున్నది. సినీ రంగంలో ప్రముఖ డాన్సర్ గా గుర్తింపు పొందిన అభి అనే యువకుడు డాన్సర్ కావ్య కళ్యాణి పాల్గొంటూ ఉండేదట.


అయితే అలాంటి సమయంలోనే అభితో పరిచయం ఏర్పడి, కొద్ది రోజులపాటు అతనికి దగ్గరగా ఉండేదట. దీంతో ఇద్దరు కలిసి సహాజీవనం చేయడం మొదలుపెట్టారట. అంతేకాదు రహస్యంగా వివాహం కూడా చేసుకున్నట్లు సమాచారం. వీరు ఐదేళ్లు బాగానే ఉన్నా.. ఇటీవల కాలంలో మేల్ డాన్సర్ అభి మరొక అమ్మాయి మోజులో పడడం జరిగిందట.ఈ విషయాన్ని ఒక వీడియో ద్వారా తెలియజేసింది కావ్య కళ్యాణి. దాంతో అప్పటినుంచి తనని పట్టించుకోవడం మానేశారని..ఇంటికి కూడా రాలేదని.. తన భర్త అభి కెరియర్ కోసమే ఎంతో కష్టపడ్డారని అందుకోసం తన డాన్స్ కెరీర్ కూడా నాశనం అయ్యిందని తెలియజేసింది.


అయితే కావ్య కళ్యాణి తాజాగా ఆత్మహత్య  ప్రయత్నం చేయడంతో హాస్పిటల్ పాలయ్యిందట. అంతేకాకుండా ఆమె ఫోన్ ఓపెన్ చేసి మరి కుటుంబ సభ్యులు అందు లో ఉన్న వీడియోను చూసి ఒకసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారని తెలియజేశారు. అయితే ఈ వీడియో తీసుకువెళ్లి మరి పోలీసులకు ఇచ్చి కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.  అందుకు సంబంధించి సోషల్  వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. దీంతో అభి నీ పోలీసులు అరెస్టు చేశారు.. అయితే ఆమెతో సహా జీవనం చేసిన విషయాలను కూడా అభి అంగీకరించారని మొత్తం మీద ప్రేమ అనే పేరుతో సహజీవనం చేసి మోసం చేశారని విషయాన్ని పోలీసులు తెలియజేశారు. మరి ఆ తర్వాత పోలీసులు ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: