టాలీవుడ్ ఇండస్ట్రీలోస్టార్ హీరోయిన్స్ లో రంభ ఒకరు. రంభ 90-2000 దశకంలో పలు భాషల్లో నటించి మెప్పించింది. ఆమె అద్భుతమైన నటనతో పాటు అందం కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు, తమిళ్ తోపాటు హిందీలోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు రంభ. అందాల భామ రంభ దాదాపు మూడు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో స్టార్‌గా రాణించింది. అయితే పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసింది రంభ. హీరోయిన్ గా రాణించిన రంభ పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేశారు. ఇక చాలా కాలంగా రంభ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పెళ్లి తర్వాత రంభ పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. 2010లో పెళ్లి చేసుకున్న రంభ ఆ తర్వాత సినిమాల్లో నటించలేదు. కానీ ఆమె పలు టీవీ షోలలో కనిపిస్తూనే ఉంది. రంభ కొన్ని తమిళ, తెలుగు ఛానెళ్ల రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా చేసింది. అలాగే రంభ కొన్ని సినిమాలకు సంబంధించిన పార్టీలు, ఈవెంట్లలో కూడా కనిపించింది. అయితే సినిమాల్లో నటించడానికి మాత్రం దూరంగా ఉంది.రంభకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. రంభ తన భర్తతో కలిసి టొరంటోలో నివాసం ఉంటోంది. అయితే ఇటీవల రంభ వైవాహిక జీవితంలో విబేధాలు వచ్చాయని, రంభ తన భర్తకు విడాకులిచ్చి ఇండియాకు తిరిగి రాబోతుందని అంటున్నారు. అంతే కాకుండా రంభ మళ్లీ సినిమాల్లో నటించడం ప్రరంభిస్తుందని అంటున్నారు.

ఈ విషయమై గతంలో ఓ మీడియాతో మాట్లాడిన రంభ.. ‘పెళ్లిలో మనస్పర్థలు వచ్చాయి. కానీ చిన్నపాటి మనస్పర్థలు మాత్రమే వచ్చాయి, అన్ని కుటుంబాల్లో ఇలాగే ఉంటుంది.ఇప్పుడు అంతా అంతా సవ్యంగా ఉంది.’ అయితే ఇప్పుడు రంభ తన భర్తకు విడాకులు ఇచ్చి తన పిల్లలతో కలిసి ఇండియాకు తిరిగి వస్తోందని తెలుస్తోంది.ఇదిలావుండగా గ్లామర్, యాక్టింగ్, గ్రేస్ ఫుల్ స్టెప్పులతో అప్పటి ఆడియన్స్ ని ఫిదా చేసిన ఈ అమ్మడు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమవుతోంది.ఈ విషయం గురించి రంభ మాట్లాడుతూ "ఇప్పుడు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి అయినా నేను సిద్ధంగా ఉన్నాను. నా ఫస్ట్ ఛాయిస్ సినిమానే. అయితే ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడానికి సరైన సమయం అని నేను అనుకుంటున్నాను. కొత్త పాత్రలను సెలెక్ట్ చేసుకుని, మళ్ళీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి ఎదురు చూస్తున్నాను" అంటూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నటిగా తన కెరీర్ లో రంభ ఎన్నో మరుపురాని క్లాసిక్ సినిమాలను అందించిన రంభ, గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు తను మరోసారి తెరపై సందడి చేయడానికి సిద్ధమంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.అలాగే తను ఎలాంటి పాత్రల్లో నటించబోతుంది అని ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.తన రాకకోసం ఆమె ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఆనడం లో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: