దర్శకుడిగా భారీ సక్సెస్ ను అందుకున్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు అని చెప్పుకోవచ్చు.ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అంత సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ గా అనిల్ రావిపూడి చోటు సంపాదించుకున్నారు.అలాంటి ఈ డైరెక్టర్ కి సంబంధించి తాజాగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో బయటపడ్డాయి అని యూట్యూబ్ లో కొన్ని వీడియో లింకులు అనిల్ రావిపూడి భార్యకు పంపిస్తున్నారట. మరి ఇంతకీ అనిల్ రావిపూడి భార్యకు ఏ వీడియోలు షేర్ చేస్తున్నారు ఇంతకీ అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. అనిల్ రావిపూడి తాజాగా సంక్రాంతి వస్తున్నాం సినిమాతో సక్సెస్ అందుకొని ఈ సక్సెస్ మీట్ లో భాగంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. 

నేను ఓ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చానని, రచయితగా నా అదృష్టాన్ని పరీక్షించుకొని డైరెక్టర్ గా సక్సెస్ అందుకున్నాను.కానీ చాలామంది నా గురించి చెడుగా వార్తలు క్రియేట్ చేసి రాసేస్తున్నారు.నా గురించి థంబ్ నెయిల్స్ పెట్టి మరీ ఏవేవో వార్తలు పెడుతూ వ్యూస్ కోసం తప్పుడు వార్తలు రాస్తున్నారు.నేనే కాదు ఇండస్ట్రీలో ఉండే ఇతర సెలబ్రిటీలపైన కూడా ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తున్నారు. వ్యూస్ కోసం అలాంటి వీడియోలు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే నాకు సంబంధించిన ఈ వీడియోలు కూడా కొంతమంది క్రియేట్ చేసి మంచి వాయిస్ ఓవర్ ఇచ్చి తప్పుడు వీడియోలు చిత్రీకరించారు.

ఇక ఈ వీడియో చూసిన మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఇవి మా ఆవిడకు షేర్ చేసి అనిల్ రావిపూడి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నాయి ఏంటి అని అడుగుతున్నారు. ఈ విషయంలో నా భార్య చాలా బాధపడుతుంది అంటూ అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో యూట్యూబ్లో తనపై వచ్చిన తప్పుడు వార్తలపై స్పందించారు. అలాగే ఇలాంటి చెత్త వార్తలపై ఇప్పటికే నేను ఇప్పటికే సైబర్ క్రైమ్ వారికి రిపోర్ట్ కూడా చేశాను.ఇంకోసారి ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తే బ్లాక్ చేసేస్తా రియాక్షన్ మరోలా ఉంటుంది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అనిల్ రావిపూడి.

మరింత సమాచారం తెలుసుకోండి: