ఏంటి అనిల్ రావిపూడి దగ్గుబాటి రానా కాంబోలో ఆ సూపర్ హిట్ మూవీ మిస్ అయిందా? ఇంతకీ రానా మిస్ చేసుకున్న ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిల్ రావిపూడి అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని రోజులు వర్క్ చేసి ఆ తర్వాత డైరెక్టర్ గా మారారు. అయితే ఈయన ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన 8 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్సే. ఏ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. అలా 100% హిట్స్ ఉన్న డైరెక్టర్ల లిస్టులో అనిల్ రావిపూడి చేరిపోయారు. అయితే అలాంటి అనిల్ రావిపూడి ఆ బ్లాక్ బస్టర్ సినిమాని దగ్గుబాటి రానా అని హీరోగా పెట్టి తీద్దాం అనుకున్నారట. కానీ రానా తన చేతులారా ఈ సినిమాని రిజెక్ట్ చేశారట. మరి ఇంతకీ వీరి కాంబోలో మిస్ అయిన ఆ సినిమా ఏంటయ్యా అంటే పటాస్.. 

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా..అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన పటాస్ మూవీ అందరూ చూసే ఉంటారు. అయితే ఈ సినిమాలో హీరోగా మొదటి అవకాశం దగ్గుబాటి రానాకే వచ్చిందట. ఈ సినిమా స్టోరీ అనుకున్న సమయంలో దగ్గుబాటి రానా ను ఊహించి ఈ స్టోరీ అనుకున్నారట అనిల్ రావిపూడి. అయితే ఈ సినిమా కథ దగ్గుబాటి రానాకి చెప్పగా.. అప్పటికే బాహుబలి మూవీ లో భల్లాలదేవ పాత్రకి కమిట్ అయిన రానా నాకు ఇప్పుడు డేట్స్ ఖాళీగా లేవు. మూడు సంవత్సరాల తర్వాత ఈ సినిమా తీద్దాం. ప్రస్తుతం నేను బాహుబలి సినిమాలో చేస్తున్నాను అని చెప్పారట.

కానీ అనిల్ రావిపూడి మాత్రం రానా కోసం మూడు సంవత్సరాలు వెయిట్ చేయడం ఇష్టం లేక వెంటనే నందమూరి కళ్యాణ్ రామ్ కి స్టోరీ చెప్పడంతో ఆయనకి ఈ మూవీ స్టోరీ బాగా నచ్చి ఓకే చేశారు. అలా పటాస్ మూవీ వీళ్లిద్దరి కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టింది. కానీ ఈ సినిమాలో హీరోగా ఫస్ట్ రానా దగ్గుబాటిని అనుకున్నప్పటికీ ఆయన బాహుబలి మూవీ కోసం పటాస్ మూవీ ని రిజెక్ట్ చేశారు. ఒకవేళ ఈ సినిమా చేసి ఉంటే రానా కమర్షియల్ హీరోగా ఇండస్ట్రీలో మంచి మార్కెట్  ని క్రియేట్ చేసుకునేవారు. కానీ బాహుబలి మూవీ కోసం ఈ సినిమాను వదిలేసి తప్పు పని చేశారని చాలామంది రానా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ బాహుబలి సినిమా కోసం రానా మరో మంచి సినిమాను మిస్ చేసుకున్నారని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: