
అయితే ఒక్కసారిగా ఆలియా భట్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆలియా భట్ ఫారెన్ ట్రిప్పులకు వెళ్లిన ఫోటోలు కూడా ఎక్కడ కనిపించడం లేదట. ఆలియా భట్, రణబీర్ కపూర్ ముద్దుల కూతురుగా రియా ఎన్నో సందర్భాలలో ఫోటోలను షేర్ చేసింది. అయితే తన కూతురు ఫోటోలను తొలగించడం పైన పలువురు యూజర్స్ ఇలా స్పందించడం జరుగుతోంది. ముఖ్యంగా ఆలియా చేసిన నిర్ణయం 100% సమర్థిస్తున్నానని నిజానికి తాను ఆలియా భట్ అభిమానిని కాకపోయినా చాలా సార్లు ఆమెను విమర్శించాను ..అయితే ఈ విషయంలో మాత్రం ఆమెకు సమర్థిస్తున్నానని తెలిపారు.
ఎందుకంటే ఇంటర్నెట్లో చాలా ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారని.. అలాంటి వారి నుంచి బయటపడాలి అంటే మనం కొంతమేరకు జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు ఆలియా చేసింది కూడా కరెక్టే అంటూ తెలుపుతున్నారు. వారు తమ కూతురిని రక్షించుకునేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ ఒక యూజర్ కామెంట్ చేయడం జరిగింది. అయితే ఇటీవలే సైఫ్ అలీ ఖాన్ ఇంటి పైన కూడా దాడులు జరిగాయి. ఈ ఘటన ఆలియా భట్ ను కూడా కలిసి వేసిందని ఈ ఘటన నేపథ్యంలోనే తన కూతురికి సంబంధించిన అన్ని విషయాలను గోప్యంగా ఉండేలా భావిస్తున్నదట. ఈ కారణం వల్లే ఆలియా ఇలాంటి నిర్ణయం తీసుకుందా అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏంటన్నది చూడాలి.