ఏంటి అనిల్ రావిపూడి నిజంగానే ఆ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారా.. ఇంతకీ అనిల్ రావిపూడి కి సంబంధించిన ఆ సీక్రెట్ వీడియోలు తన భార్య చేతిలో ఉన్నాయి అనడంలో ఎంత నిజం ఉంది.ఈ వీడియోల విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి  ఏ విధంగా స్పందించారు అనేది ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఎక్కువగా సెలబ్రిటీలకు సంబంధించి చెత్త వార్తలు రావడం సర్వసాధారణం. వారికి సంబంధించి హాట్ హాట్ న్యూస్ లను థంబ్ నెయిల్స్ పెట్టి వ్యూస్ కోసం అలా చేస్తూ ఉంటారు. అయితే తాజాగా అనిల్ రావిపూడి కి సంబంధించి కూడా ఇలాంటి ఓ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే అనిల్ రావిపూడి రీసెంట్గా సంక్రాంతి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చౌదరీ ని తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. 

అయితే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి యాక్టింగ్ బాగుంది అలాగే ఈ సినిమా ఈవెంట్లో భాగంగా ఓ యాంకర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కి మీనాక్షి చౌదరికి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మీ నెక్స్ట్ సినిమాలో కూడా ఈ హీరోయిన్ నే కొనసాగిస్తారా అని ప్రశ్నించింది. అయితే ఈ చిన్న పాయింట్ ని పట్టుకొని యూట్యూబ్లో కొంతమంది నెటిజన్లు హీరోయిన్ తో అనిల్ రావిపూడి ఎఫైర్ పెట్టుకున్నట్లుగా థంబ్ నెయిల్స్ ని సృష్టిస్తూ రాస్తున్నారట.అయితే ఈ వీడియోలు యూట్యూబ్ లో చక్కర్లు కొట్టడంతో ఇవి చూసిన అనిల్ రావిపూడి బంధువులు ఆమె భార్యకు పంపి ఇదేం న్యూస్ అని అడుగుతున్నారట.

దాంతో ఇంటికి వచ్చాక అనిల్ రావిపూడిని ఆయన భార్య నిలదీసి ఏంటి ఇలా రాస్తున్నారు అని అడిగిందట.దానికి బాగా హర్ట్ అయిపోయిన అనిల్ రావిపూడి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఇలాంటి వార్తలు క్రియేట్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారట.అయితే ఇదే విషయాన్ని అనిల్ రావిపూడి ఓ ఈవెంట్లో చెబుతూ ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు రిపీట్ అయితే మాత్రం రియాక్షన్ మరోలా ఉంటుంది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు రిపోర్ట్ చేశాను.ఇలాంటి వీడియోలు పెట్టే వారిపై యూట్యూబ్ కూడా చర్యలు తీసుకుంటుంది వారిని బ్లాక్ చేస్తుంది అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: