సినిమా ఫీల్డ్ లో హీరోయిన్స్ ఎక్కువ కాలం కొనసాగలేరు.. కొత్త హీరోయిన్స్ వచ్చే కొలది పాత హీరోయిన్స్ ఫెడ్ అవుట్ అవుతూ ఉంటారు.. అలా హీరోయిన్స్ ఫామ్ లో ఉన్న సమయంలోనే మంచి గుర్తింపు సాధించి కెరియర్లో సెట్ కావాలి.. అలా కొంతమంది ఎన్ని సినిమాల్లో నటించినా కానీ వారికి ఫ్లాప్ లే ఎదురవుతాయి.. అయినా సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్సులు మాత్రం తగ్గవు.. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అందాల తార భాగ్యశ్రీ బోర్సే.. ఈమె చేసిన చిత్రాల్లో చాలావరకు ఫ్లాప్సే ఉన్నాయి.. అయినా తన అందం అభినయంతో సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ పెద్దపెద్ద హీరోయిన్లకు కూడా పోటీ ఇస్తోంది.. అలాంటి భాగ్యశ్రీ బోర్సే గురించి కొన్ని వివరాలు చూద్దాం.. ఈమె తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరో రవితేజ సినిమా ద్వారానే.. 

రవితేజ హీరోగా వచ్చిన Mr.బచ్చన్ అనే చిత్రం ద్వారా  తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి భారీ ఫ్లాప్ అందుకుంది.. కానీ ఈ సినిమాలో భాగ్యశ్రీ తన అందాలతో కుర్రకారును తన వైపు తిప్పుకునేలా చేయడంతో సినిమా పోయినా ఆమెకు మాత్రం మంచి పేరు వచ్చింది.. ఈమె ఈ సినిమాలో నటించడానికంటే ముందే మరో రెండు సినిమాలు కమిట్ అయిందట.. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్ డమ్ మూవీకీ అడ్వాన్స్ తీసుకుందని తెలుస్తోంది. అంతేకాకుండా  హీరో రామ్ పోతినేని సినిమాలో  కూడా నటించేందుకు సైన్ చేసింది. ఇదంతా పక్కన పెడితే మరో పాన్ ఇండియా స్టార్ అయినటువంటి  ప్రభాస్ తో కూడా  నటించబోతున్నట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి అందరికి తెలిసిందే..

సినిమా పేరు బ్రహ్మ రాక్షసా అనే టైటిల్ కూడా పెట్టాలని చిత్ర యూనిట్ ఆలోచన చేస్తుందట.. ఇందులో ప్రభాస్ మొట్టమొదటిసారి నెగిటివ్ పాత్రలో నటిస్తున్నారట. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే లుక్ టెస్ట్ నిర్వహించారని, ఈ లుక్ టెస్టులో ప్రభాస్ తో పాటు భాగ్యశ్రీ బోర్సే కూడా పాల్గొన్నట్టు సమాచారం అందుతుంది. దీన్నిబట్టి చూస్తే మాత్రం ఈమె ఫ్లాప్స్ ఎన్ని వచ్చినా వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ పోతుందని అదృష్టం అంటే భాగ్యశ్రీదే అని అంటున్నారు నెటిజన్స్. అయితే ప్రభాస్ సినిమా కోసం భాగ్యశ్రీ బోర్సే ఏకంగా 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: