హీరోగా ,విలన్ గా పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి పేరు సంపాదించిన హీరో ఆది పినిశెట్టి ఇటీవలే నటించిన హారర్ చిత్రం శబ్దం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదు అనిపించుకుంది. ఆది పినిశెట్టి గతంలో హీరో రామ్ చరణ్ తో కలిసి రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ అన్న పాత్రలో నటించారు. శబ్దం సినిమా ప్రమోషన్స్లో రంగస్థలం సినిమాలో జరిగిన కొన్ని విషయాలను పంచుకోవడం జరిగింది. అందులో ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా తెలియజేశారు హీరో ఆది పినిశెట్టి.



తాను రంగస్థలం సినిమాలో పెట్టుకున్న కళ్ళజోడిని ఎవరికి తెలియకుండా తీసుకువచ్చేసానని అది ఇప్పటికీ కూడా తన వద్దనే ఉందని ఈ విషయం ఎవరికీ తెలియదని తెలియజేశారు. సాధారణంగా ఆది పినిశెట్టి కళ్ళజోడు ను ఉపయోగించారు. రంగస్థలం సినిమాలో తన పాత్రకు కళ్ళజోడు ఉంటుంది. అయితే అది కూడా చిత్ర యూనిట్ ప్రాపర్టీ అయినప్పటికీ కూడా షూటింగ్ అయిపోయాక ఎవరికి చెప్పకుండా ఆ కళ్లజోడుని సైలెంట్ గా తీసుకువచ్చేసానని తనకి గుర్తుగా ఈ కళ్ళజోడిని దాచుకున్నాను అని తెలిపారు ఆది పినిశెట్టి.


అయితే అంత పెద్ద సినిమాలో అలాంటి చిన్న కళ్ళజోడిని సైతం ఎవరు పట్టించుకోకపోయినా .. తన సినీ జీవితంలో భాగంగా జరిగిన ఇలాంటి సరదా సంఘటనలను గూర్చి తెలియజేశారు ఆది పినిశెట్టి. ఇక రామ్ చరణ్ గురించి తెలియజేస్తూ..రంగస్థలం సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ తో తనకి మంచి స్నేహబంధం ఏర్పడిందని తామిద్దరూ ఎప్పుడు కూడా ఓపెన్ గానే మాట్లాడుకుంటామని తెలిపారు. అయితే సినిమా అయిపోయిన తర్వాత ఎవరికి ఎవరు టచ్ లో లేమని బయట ఎప్పుడైనా కనిపిస్తే పలకరిస్తూ ఉంటామని తెలియజేశారు ఆది పినిశెట్టి. మొత్తానికి రంగస్థలం సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సీక్రెట్ ను మాత్రం రివీల్ చేయడం జరిగింది

మరింత సమాచారం తెలుసుకోండి: