
అది తెలుగు ఇండస్ట్రీ కాదు హాలీవుడ్ కాదు.. బాలీవుడ్ కాదు కోలీవుడ్ కాదు అన్నిచోట్ల రాజమౌళి పేరు మారుమ్రోగిపోతుంది . మరి ముఖ్యంగా మహేష్ బాబుతో ఆయన తెరకెక్కించే సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నాడో చూసి జనాల సైతం షాక్ అయిపోతున్నారు. కాగా ఇలాంటి టైం లోనే రాజమౌళికి సంబంధించిన కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి . రాజమౌళి తన కెరియర్ లో ఎన్నో సినిమాలు తెరకెక్కించాడు . అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ సినిమాలే.
అయితే ఓ జోనర్ మాత్రం అస్సలు రాజమౌళి తెరకెక్కించలేరు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఒక డైరెక్టర్ అంటే అన్ని సినిమాలను తెరకెక్కించగలగాలి.. అన్ని జోనర్ లోనూ ఆయన సినిమాలను తెరకెక్కించే సత్తా ఉండాలి. రాజమౌళి యాక్షన్ - సెంటిమెంట్ ఇలా ఏ సినిమా అయినా తెరకెక్కిస్తాడు . కానీ రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించాలి అన్న ఫుల్ టు ఫుల్ రొమాంటిక్ జోనర్లో మూవీ తెరకెక్కించాలి అన్న రాజమౌళి వల్ల అస్సలు కాదు . కొంతమంది రాజమౌళి లో అసలు రొమాంటిక్ యాంగిల్ లేదు అంటూ ఉంటారు . ఫ్యూచర్లో కూడా అలాంటి సినిమా ఒకటి ఆయన నుంచి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయకపోవడం మంచిది అంటున్నారు జనాలు. ప్రజెంట్ మహేష్ బాబు తెరకెక్కించే సినిమా కోసం ఆయన ఫుల్ స్థాయిలో కష్టపడుతున్నారు . త్వరలోనే ఆఫ్రికా అడవులకి సినిమా టీం మొత్తం వెళ్ళబోతుంది అంటూ కూడా తెలుస్తుంది..!