"కన్నప్ప".. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి పాజిటివ్ కామెంట్స్ కన్నా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ దక్కాయి . మరీ ముఖ్యంగా మంచు విష్ణు పై జరిగే ట్రోలింగ్ కి ఈ సినిమా భారీ స్థాయిలో దెబ్బతింటుంది అంటూ జనాలు మాట్లాడుకుంటూ వచ్చారు . అంతేకాదు కన్నప్ప సినిమా నుంచి ఏ అప్డేట్ రిలీజ్ అయిన .. ఏ విషయం లీక్ అయినా..సోషల్ మీడియాలో పాజిటివిటీ కన్న నెగిటివిటీనే ఎక్కువగా పెరిగిపోయింది . కాగా ఏప్రిల్ 25వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం సినిమా నుంచి సెకండ్ టీజర్ ని రిలీజ్ చేసింది .


అయితే ఈ టీజర్ ఇప్పుడు అభిమానలను బాగా ఆకట్టుకుంటుంది . మొదటి టీజర్ లో చేసిన తప్పులు అన్నీ రెండవ టీజర్ లో సరిచేసుకున్నారు మూవీ టీం . అసలు దేవుడు అంటే నమ్మకం లేని తిన్నడు అమ్మవారి విగ్రహాన్ని సైతం రాయిల భావించేవాడు ..ఎలా  శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు అనేది సినిమా థియేటర్లో చూడాలి. మరీ ముఖ్యంగా ఈసారి క్యాస్టింగ్ మొత్తాన్ని ఒక పద్ధతి ప్రకారం రివీల్ చేసి మంచి పని చేసింది మూవీ టీం. అంతే కాదు మంచు విష్ణు -మోహన్ బాబు - శరత్ కుమార్ -ముఖేష్ బుషి- అక్షయ్ కుమార్ -కాజల్ అగర్వాల్ - మోహన్ లాల్- ఐశ్వర్య భాస్కర్ ..తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపిస్తూ ఉండడం విశేషం .



మరీ ముఖ్యంగా టీజర్ మొత్తం ఒక లెక్క టీజర్ లాస్ట్ మూడు సెకండ్లు ఒక లెక్క ..అనేలా టీజర్ ని రిలీజ్ చేశారు . లాస్ట్ మూడు సెకండ్ల పాటు ప్రభాస్ ఫేస్ రివీల్ చేసి టీజర్ ని హైలైట్ గా మార్చేశారు. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ పెట్టిన కండిషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. నిజానికి ప్రభాస్ పాన్ ఇండియా హీరో . వరుసగా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు . అలాంటి హీరో దగ్గర నుంచి కాల్ షీట్ ఒక్క రోజు తీసుకోవడం అంటే పెద్ద గగనమైన విషయమే . అయితే మోహన్ బాబు అంటే చాలా రెస్పెక్ట్ గల ప్రభాస్.. ఈ సినిమా కోసం ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే కేవలం 7 రోజులు కాల్ షీట్స్ ఇస్తాను అంటూ ఓకే చేశారట . ఆ ఏడు రోజుల కాల్ షీట్ లోనే ప్రభాస్ కి సంబంధించిన సీన్స్ అన్నీ కూడా తెరకెక్కించేలా మాట్లాడుకున్నారట . ఆ తర్వాత ప్రభాస్ మిగతా పాన్ ఇండియా సినిమాల షూట్ లో బిజీగా అయిపోవాలి అన్న కారణంగానే ఇలా టీంకు కండిషన్ పెట్టారట . మహా తెలివైన వాడే.. లేకపోతే సినిమా కోసం చాలా చాలా కాల్ షీట్స్ మింగేసేవారు మూవీ టీం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ప్రభాస్ లుక్స్ ను ప్రభాస్ కండీషన్ ని పొగిడేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: