
ఇది ఇలా ఉండగా... తాజాగా అనసూయ సంచలన కామెంట్స్ చేసింది. ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో పైన... ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది యాంకర్ అనసూయ భరద్వాజ. ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో నుంచి ఎందుకు... బయటికి రావాల్సి వచ్చింది అనే దాని పైన క్లారిటీ ఇచ్చింది. యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అనసూయ భరద్వాజ్. తనకు అన్నం పెట్టింది జబర్దస్త్ షో అంటూ ఆమె ఎమోషనల్.. కావడం జరిగింది.
అప్పటివరకు తనకు పెద్దగా కెరీర్ లేదని.. నేను యాంకర్ గా జబర్దస్త్ కామెడీ షో కి వచ్చిన తర్వాత తన పేరు అందరికీ తెలిసిందని... యాంకర్ అనసూయ చెప్పడం జరిగింది యాంకర్ గా గుర్తింపు తెచ్చింది జబర్దస్త్ షో అంటూ.. వెల్లడించారు అనసూయ. అయితే ఈ కామెడీ షోలో కొంతమంది తనపై అసభ్యకరమైన కామెంట్స్ చేసే వారిని... ఎమోషనల్ అయ్యారు అనసూయ భరద్వాజ్. ఆ సందర్భంలో కామెడీ బాగానే పండిందని వెల్లడించారు.
వాళ్లు సరదాగా అన్నప్పటికీ.. ఆ తర్వాత తాను బాధ పడేదాన్ని అంటూ చెప్పుకొచ్చారు. అలా అసభ్యకర మాటలు పడటం ఇష్టం లేకే బయటికి వచ్చినట్లు వివరించారు యాంకర్ అనసూయ భరద్వాజ్. ఇప్పుడు మళ్లీ వాళ్ళు వచ్చి పిలిస్తే యాంకర్ గా వెళ్తానని ప్రకటన చేశారు. కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్... జబర్దస్త్ వాళ్లకు పెట్టి అందులోకి వెళ్తానని చెప్పారు. లేకపోతే అస్సలు ఆ షో కి వెళ్ళనని వివరించారు. అయితే ఈ షోలో చాలామంది.. ఆర్టిస్టులు దారుణంగా యాంకర్ అనసూయ ను ట్రోలింగ్ చేసేవారు. ఆ ఎపిసోడ్ ని యాంకర్ అనసూయ గుర్తు చేసుకున్నారు.