
కానీ నాగార్జున అలా నటిస్తే మాత్రం చూడాలి అనిపిస్తూ ఉంటుంది . అది ఎందుకో తెలియదు కానీ ఆయన అలా నటించేటప్పుడు చాలా చాలా గమ్మత్తుగా ఉంటుంది అని జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు . అసలు నాగార్జునకి ఇంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కారణం ఆ రొమాంటిక్ యాంగిల్ వల్లే అని చెప్పుకోవడంలోనూ సందేహం లేదు. కాగా నాగార్జున ఇప్పుడు తన 100వ సినిమా కోసం ఎంతో ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు . అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 24వ తేదీ అఖిల్ అక్కినేని పెళ్లి అయిపోగానే ఆయన తన వందవ సినిమాని అఫీషియల్ గా ప్రకటించబోతున్నాడట .
ఆయన తన 100వ సినిమా ని టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . అంతేకాదు నిన్న మొదటి వరకు ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటించబోతుంది అంటూ ఓ టాక్ బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరొక అందాల ముద్దుగుమ్మ కూడా నటించబోతుంది అంటూ తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే స్టోరీ కోసం వశిష్ట ఒక సూపర్ ట్రెడిషనల్ హీరోయిన్ ని చూస్ చేసుకున్నారట . ఆమె మరి ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ నాగార్జున . మీనా-నాగ్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు . ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి . వెంకటేష్ సౌందర్య ఎంత హిట్ పెయిరో .. నాగార్జున - మీనా కూడా అంతే హిట్ కాంబో. అయితే ఇన్నాళ్లకు మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి నటించబోతున్నారు అని తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . ఈ కాంబో సెట్ అయ్యి తెరకెక్కితే మాత్రం రచ్చ రంబోలానే . మన్మధుడు మించిన హిట్ నాగార్జున ఖాతాలో పడినట్లే అంటున్నారు జనాలు..!