
అసలు ఇద్దరు బడా స్టార్ హీరోస్ కలిసి ఒక తెలుగు సినిమాలో మల్టీస్టారర్ గా నటించగలరా ..? అని ఎంతో మంది జనాలు ఆలోచించారు..మాట్లాడుకున్నారు..యస్ అది సాధ్యమే అంటూ ప్రూవ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ . అఫ్ కోర్స్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చరణ్ క్యారెక్టర్ ఎక్కువగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ తక్కువగా ఉంది అంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ అవి ఏవి పెద్దగా పట్టించుకోలేదు ఈ హీరోస్. ఈ ఇద్దరు సినిమా ప్రమోషన్స్ కి అయితే అటెండ్ అవుతూ హైలెట్ చేశారు .
అయితే నిజానికి రాజమౌళి ఈ సినిమాలో ముందుగా హీరో సూర్యని అనుకున్నారట . ఎప్పటినుంచో సూర్యతో సినిమా తెరకెక్కించాలి అంటూ ఆశపడుతున్నారట . రాజమౌళి - బాహుబలి సినిమాలో కూడా ముందుగా సూర్య నే అనుకున్నారట. కానీ సూర్య కొన్ని కారణాలు చేత రిజెక్ట్ చేస్తూ వచ్చారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కూడా సూర్య - ఎన్టీఆర్ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేశారు . అయితే ఆ తర్వాత ఈ క్యారెక్టర్ కోసం ఫైనల్లీ రాజమౌళి - జూనియర్ ఎన్టీఆర్ ని సెలెక్ట్ చేసుకున్నారు . ఒకవేళ చరణ్ - సూర్య కాంబో మాత్రం సెట్ అయి ఉంటే అది వేరే లెవెల్. ఎందుకంటే రాంచరణ్ ఫేవరెట్ హీరో సూర్యనే..!