
మెగాస్టార్ చిరంజీవి ఫిలిం ఫేర్ నుంచి పద్మభూషణ్ దాకా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను కూడా అందుకున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవికి యూకే ప్రభుత్వం అక్కడ పౌరసత్వాన్ని సైతం ఇచ్చినట్లుగా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపైనా చిరంజీవి టీమ్ స్పందిస్తూ.. చిరంజీవి గారు బ్రిటిష్ దేశపు గౌరవపారసత్వాన్ని సైతం అందుకుంటున్నట్లు వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదంటూ టీమ్ కొట్టి పారేసింది. ఈ విషయాలను ఎవరు వైరల్ గా చేయొద్దంటు రిక్వెస్ట్ చేస్తోంది చిరంజీవి టీమ్
ఈ రూమర్స్ సంగతి పక్కన పెడితే యూకేలో చిరంజీవికి సన్మానించేందుకు సైతం ఒక ప్లాన్ చేశారని.. ఈ ప్లాన్ కి చిరంజీవి కూడా హాజరు కావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలె చిరంజీవి దుబాయ్ కి వెళ్లి మరి విశ్రాంతి తీసుకుని రావడం ఆ తర్వాత తిరిగి విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీగా పాల్గొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వంభర చిత్రం తర్వాత చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావు పూడితో తన తదుపరి చిత్రాన్ని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీంతో వీరు కాంబినేషన్ పైన కూడా మరింత ఆసక్తి పెరగడంతో అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.