
నిజమే ఆదిలాంటి సినిమా తెరకెక్కించడానికి మరొకసారి ఏ డైరెక్టర్ సాహసం చేయరు. జూనియర్ ఎన్టీఆర్ కూడా అప్పటిలా నటించలేకపోవచ్చు . కానీ ఆ సినిమాలో ఆయన తొడగొట్టే సీన్ మాత్రం ఎప్పటికీ ఎవర్గ్రీన్ ట్రేండింగ్ సీన్ .అసలు మర్చిపోలేం . అయితే జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత చాలా సినిమాలలో అలాంటి సీన్స్ నటించినా పెద్దగా హైలెట్ కాలేకపోయాయి . కానీ ఈసారి ప్రశాంత్ నీల్ ఆ సీన్ ని హైలైట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ తో మళ్లీ అలా మీసం మేలేసి తొడగొట్టే ఇలాంటి సీన్స్ తెరకెక్కించబోతున్నారట.
యాస్ ఇట్ ఈజ్ ఆది సినిమాలో ఏ బాడీ మోడ్యులేషన్ తో జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఎలివేషన్ పాత్రలో కనిపించారో..అందుకు డబల్ స్థాయిలోనే ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని చూపించడానికి ట్రై చేస్తున్నారట. సోషల్ మీడియా ప్రజెంట్ ఈ వార్త బాగా హైలైట్ గా మారింది. రీసెంట్ గానే ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబో లో తెరకెక్కే సినిమా పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది . అంతే కాదు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ ను చూస్ చేసుకున్నారట . ఇద్దరు హీరోయిన్స్ తో ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ సీన్స్ కూడా వేరే లెవెల్ లో రాసుకున్నారట. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఫ్యాన్స్ వెయిటింగ్..!!?