టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాలు అంచనాలకు మించి పెరిగాయి. ఒక్కో స్టార్ హీరో 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల విషయంలో అదరగొడుతున్నాయి. అయితే స్టార్ హీరోలు మాత్రం సినిమాలోని కీలక సన్నివేశాలను డూప్ లతో తీసేలా చేస్తూ కెరీర్ విషయంలో జాగ్రత్త పడుతున్నారు.
 
వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా సినిమాల్లో నటిస్తూ భారీ విజయాలను సొంతం చేసుకుంటున్న ఒక స్టార్ హీరో డూప్ ఆలస్యంగా వచ్చాడని ఫైర్ అయ్యాడట. అయితే ఆ డూప్ ఆ హీరోకు సంబంధించిన మరో సినిమా షాట్స్ తో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా షూట్ కు అనుకున్న సమయానికి రాలేదని సమాచారం అందుతోంది. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.
 
ఊహించని స్థాయిలో పారితోషికాలను అందుకునే స్టార్ హీరోలు నిర్మాతలు, దర్శకులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఏంటనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అయితే డూప్ అనే పదం వాడటానికి కూడా ఇష్టపడని స్టార్ హీరోలు ఆ పదానికి బదులుగా బాడీ డబుల్ అనే పదాన్ని వాడుతున్నారు. స్టార్ హీరోలు వేగంగా సినిమాలు చేయడంలో అసలు ట్విస్ట్ తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపడుతున్నారు.
 
టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ హీరోల క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ , పాపులారిటీ సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ హీరోల సినిమాలకు నిర్మాతలు 500 నుంచి 1000 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేస్తున్నారు. సినిమాలకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే సమస్య లేదు కానీ నెగిటివ్ టాక్ వస్తే మాత్రం నిర్మాతలు ప్రమాదంలో పడుతున్నారు. రాబోయే రోజుల్లో అయినా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఈ పరిస్థితి మారుతుందేమో చూడాలి.


 
 


మరింత సమాచారం తెలుసుకోండి: