టాలీవుడ్ డేరింగ్‌అండ్ డాష్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకప్పుడు ఎలాంటి స‌క్స‌స్‌ల‌తో దూసుకుపోయాడో తెలిసిందే. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, చరణ్, వరుణ్ తేజ్, రామ్ లాంటి హీరోలకు సైతం హిట్లు ఇచ్చి వారిని స్టార్ హీరోలుగా తీర్చిదిద్దాడు. సీనియర్ హీరోలు నాగార్జున, బాలకృష్ణ లతోను సినిమాలు తెర‌కెక్కించాడు. ఇక పూరి జగన్నాథ్‌ పర్సనల్ విషయానికొస్తే .. లావణ్య అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న టైం లో లావణ్య చూసి ప్రేమలో పడ్డ పూరి.. యాంకర్ ఝాన్సీ, నటి హేమ సాయంతో త‌న‌ను వివాహం చేసుకున్నారు. వీరికి కొడుకు ఆకాష్ పూరీ తో పాటు , కూతురు కూడా ఉంది.


ఇక లావణ్య భ‌ర్త‌ ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా అసలు అహం చూపించదు. డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇప్పుడు భర్త కష్టాల్లోనూ అతనికి చేదోడువాదోడుగా ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య .. టాలీవుడ్ హీరోలతో, వారి ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని వివరించింది. మాస్‌మహారాజ రవితేజ గురించి మాట్లాడుతూ.. ఆయన ఎప్పుడు వచ్చిన కింద కూర్చుంటాడు .. కిందే పడుకుంటాడు .. మా ఫ్యామిలీకి ఆయన ఎంతో క్లోజ్ అంటూ వివరించింది . బన్నీ అక్క .. అక్క .. అని నన్ను పిలుస్తాడని .. ఇక బన్నీ అమ్మ నిర్మల గారిని .. నేను నిర్మలమ్మ అని పిలుచుకుంటాను .. త‌ను మాతో ఎంతో ఆప్యాయంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చింది.


ఇక మహేష్ బాబు ఇంటికి ఎప్పటికప్పుడు గెట్ టు గెదర్‌కి వెళ్తూనే ఉంటామని .. అలాగే మోహన్ బాబు గారి భార్య నిర్మలాదేవి అంటే నాకు చాలా ఇష్టమని .. ఆమె నాకు ఇన్స్పిరేషన్ అంటూ వివరించింది. ఇక చిరంజీవి భార్య సురేఖను నేను అక్క అక్క అని పిలుస్తానని .. మెగాస్టార్ చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో. ఆయన ఎక్కడ కనిపించినా తనను బావ అని పిలుస్తా అంటూ చిరు పైన అభిమానాన్ని వివరించింది. ఇక పూరి జగన్నాథ్ కు చిరంజీవితో ఓ సినిమా తెర‌కెక్కించాల‌ని క‌ల‌. కాగా గతంలో వీరిద్దరూ కాంబోలో ఆటో జానీ సినిమా సెట్స్‌ పైకి వచ్చిన తర్వాత ఆగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: