టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్రేజ్, మార్కెట్ పరంగా ఇతర హీరోలకు అందని స్థాయిలో ఉన్నారు. ప్రభాస్ నటిస్తే 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు పక్కా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో అత్యంత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సినిమా ఏదనే ప్రశ్నకు స్పిరిట్ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తోంది. స్పిరిట్ సినిమా ఎన్నో ట్విస్టులతో తెరకెక్కుతోందని తెలుస్తోంది.
 
స్పిరిట్ సినిమా 2000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తే బాగుంటుందని సందీప్ రెడ్డి వంగా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. తక్కువ సినిమాలే తీసినా సందీప్ రెడ్డి వంగా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం. స్పిరిట్ మూవీ బాహుబలి2 సినిమాను దాటాలంటే 2000 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాలని ఆయన అన్నారు.
 
ఈ టార్గెట్ చిన్న టార్గెట్ కాదని చాలా పెద్ద టార్గెట్ అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చారు. నా వంతుగా నేను మాత్రం మంచి సినిమాను తెరకెక్కిస్తానని ఆయన కామెంట్లు చేశారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు. స్పిరిట్ సినిమా 2000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తే మాత్రం ఒక విధంగా సంచలనం అవుతుందని చెప్పవచ్చు.
 
సందీప్ రెడ్డి వంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుండగా టాలీవుడ్ స్టార్ హీరోలంతా సందీప్ డైరెక్షన్ లో నటించడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా సినిమాలకు తన కుటుంబ సభ్యులే నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. నిర్మాతగా కూడా సందీప్ రెడ్డి వంగా మంచి లాభాలను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. సందీప్ రెడ్డి వంగా కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: