ఎంతోమంది హీరో హీరోయిన్ లు ఎన్నో వింత వ్యాధులతో బాధపడుతున్న సంగతి మనకు తెలిసిందే.కొంతమంది ట్రీట్మెంట్ లేని వ్యాధితో కూడా బాధపడుతున్నారు. అయితే తాజాగా దీపిక పదుకొనే కూడా అలాంటి ఓ వ్యాధితో బాధపడిందట. ఆ వ్యాధి వల్ల డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయిందట. మరి ఇంతకీ దీపికా పదుకొనేకి ఉన్న ఆ వ్యాధి ఏంటో ఇప్పుడు చూద్దాం.. సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తన ఫస్ట్ ఫిలిం చేసిన దీపికా పదుకొనే ఆ తర్వాత నార్త్ ఇండస్ట్రీలోకి వెళ్ళింది. ఎప్పుడైతే బాలీవుడ్లో దీపిక పదుకునే నటించిన సినిమాలు హిట్ అయ్యాయో అప్పటినుండి ఈ హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.అలా చిన్న హీరోయిన్ నుండి బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలే స్థాయికి వెళ్లిపోయింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. గత ఏడాది దీపిక పదుకొనేకి పండంటి పాప జన్మించింది. 

ప్రస్తుతం తల్లిగా తన భాద్యతలు కొనసాగిస్తుంది.ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక పదుకొనే తనకి సంబంధించిన ఒక సీక్రెట్ విషయాన్ని బయట పెట్టింది.దీపిక మాట్లాడుతూ.. 2014 సమయంలో ఈ సంఘటన జరిగింది. అప్పట్లో నేను సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నాను. అలా ఓ రోజు సినిమా షూటింగ్లో సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాను.దాంతో అందరూ గాబరాపడ్డారు.కానీ ఏం కాదులే నీరసం అనుకున్నాను. అయితే ఆ తర్వాత ఎందుకైనా మంచిదని హాస్పిటల్ కి వెళ్లాను. అలా హాస్పిటల్ కి వెళ్లి అన్ని టెస్ట్లు చేయించుకుని స్కానింగ్లు చేయించుకోగా నాకు హెల్త్ అస్సలు బాలేదని తెలిసింది.కానీ చికిత్స తీసుకుంటే ఆ హెల్త్ ప్రాబ్లం పోతుంది అని డాక్టర్లు తెలిపారు. దాంతో ట్రీట్మెంట్ ఉన్న వ్యాధి ఉన్నప్పటికీ నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్లి పోయాను. మానసికంగా కృంగిపోయి ఎన్నో రోజులు ఏడ్చాను. నా హెల్త్ కి ఏమీ కాకపోయినప్పటికి ఏం జరగబోతుందో అని అయోమయపడేదాన్ని. 

అయితే ఓ రోజు మా అమ్మ నన్ను చూడడానికి వచ్చిన సమయంలో ఈ విషయం చెప్పాను. దాంతో మా అమ్మ ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళమని నాకు సలహా ఇచ్చింది. అలాగే థెరపిస్టు దగ్గరికి వెళ్ళిన సమయంలో ఈ విషయం ఎక్కడా కూడా మీడియాలో లీక్ అవ్వకుండా గోప్యంగా ఉంచమని చెప్పింది.అయితే మా అమ్మ ఆరోజు ఎందుకు అలా చెప్పిందో నాకు అర్థం అవ్వలేదు. ఇక మా అమ్మ సలహాతో నేను ఒక మంచి థెరపిస్ట్ ని కలిసి మంచి ట్రీట్మెంట్ తీసుకున్నాను. కానీ ఈ విషయాన్ని అప్పట్లో అమ్మ చెప్పినట్టు సీక్రెట్ గానే ఉంచాను. ఇక ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలో మెల్లిమెల్లిగా నా ఆరోగ్యం కుదుటపడింది. అలా నా ఆరోగ్యం కుదుటపడ్డాక వెంటనే నాకు సంబంధించిన మానసిక విషయాన్ని మెల్లిమెల్లిగా బయటికి చెప్పడం ప్రారంభించాను.అప్పుడే అర్థమైంది మా అమ్మ ఎందుకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచమని చెప్పిందో. ఇక నేను ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలో ఎంత డిప్రెషన్ లోకి వెళ్లానో దాన్ని దృష్టిలో పెట్టుకొని లీవ్ లాఫ్ లవ్ అనే ఫౌండేషన్ ని స్థాపించాను.ఆ ఫౌండేషన్ స్థాపించడానికి కారణం ఇదే అంటూ దీపికా పదుకొనే తనకి సంబంధించిన ఓ సీక్రెట్ విషయాన్ని బయటపెట్టింది

మరింత సమాచారం తెలుసుకోండి: