బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లను నందమూరి అభిమానులు ఏ స్థాయిలో అభిమానిస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక దశలో అటు బాలయ్య, ఇటు ఎన్టీఆర్ ఆశించిన విజయాలను అందుకోవడంలో ఫెయిల్ అయినా ఈ హీరోలు తర్వాత కాలంలో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. 2015 సంవత్సరం నుంచి తారక్ వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తుండగా 2020 సంవత్సరం నుంచి బాలయ్యకు భారీ విజయాలు దక్కుతాయి.
 
ఒకవైపు బాలయ్య మరోవైపు తారక్ బ్యాక్ టూ బ్యాక్ విజయాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్నారు. సరైన ప్రాజెక్ట్ లో నటిస్తే ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తారో ఈ హీరోలు చెప్పకనే చెబుతున్నారు. టాలీవుడ్ టైర్1 డైరెక్టర్లు సైతం బాలయ్య, ఎన్టీఆర్ లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ స్టార్ హీరోల లైనప్ కూడా అదిరిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
అయితే బాలయ్య, తారక్ కలిసి ఒకే వేదికపై కనిపించి చాలా సంవత్సరాలు అయింది. బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ఈవెంట్ సమయంలో చివరిగా బాలయ్య, తారక్ కలిసి కనిపించడం జరిగింది. బాలయ్య పారితోషికం 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. బాలయ్య, తారక్ కెరీర్ పరంగా టాప్ లో ఉన్నారు.
 
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తన సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును సొంతం చేసుకోగా బాలయ్య నటించిన డాకు మహారాజ్ మూవీ ఓటీటీలో కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది. డాకు మహారాజ్ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో వ్యూస్ విషయంలో సంచలనాలు సృష్టిస్తోంది. బాలయ్య, ఎన్టీఆర్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: