పాన్ ఇండియా సినిమాలు చేయడం ఎంతసేపు ? 100 కోట్ల బడ్జెట్ ఉంటే ఎవరైనా సినిమా చూసేస్తారు .. కానీ వాటిని అందరికీ నచ్చేలా తేర‌కక్కించడమే అసలైన ఘట్టం .. ఈ ఘట్టంలో భారీగా క్రేజ్ తెచ్చుకుంది సౌత్ దర్శకులేనా ..? ఇందులో మరీ ముఖ్యంగా తెలుగు డైరెక్టర్స్‌ కు మాత్రమే పాన్ ఇండియా విజయాలు ఇచ్చే ట్రిక్ తెలిసిందా ? మన దర్శకులు మాత్రమే ఈ సక్సెస్ ఫార్ములా ఎలా పట్టుకున్నారు ? అనేది ఈ స్టోరీలో చూద్దాం. పాన్ ఇండియా సినిమా అంటే కేరాఫ్ సౌత్ సినిమాగా మారి ముఖ్యంగా కేర్ ఆఫ్ తెలుగు సినిమా అయిపోయింది ..


ఇప్పుడు భారతీయ సినీ ప్రేక్షకుల నాడి పట్టుకోవటం మన దర్శికులకు బాగా తెలిసినంతగా మరి ఏ ఇండస్ట్రీ డైరెక్టర్లకు తెలియదంటే ఎలాంటి అతిశయక్తి లేదు .. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటే .. ఇప్పుడు మన ఇండియన్ సినిమాలను శాసిస్తుంది తెలుగు సినిమా. 2015 జులై 10 తెలుగు సినిమా గతిని వేగాన్ని మార్చేసి మరో లెవల్ కు తీసుకెళ్లిన డేట్ ఇది .. ఇక ఆరోజే రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమా రిలీజ్ అయింది .. తెలుగు సినిమా పక్కనే ఉన్న తమళ‌ ఇండస్ట్రీ కూడా వెళ్ళని రోజుల్లో ఏకంగా బాలీవుడ్ తీసుకువెళ్లి అక్కడి ప్రేక్షకులతో పూనకాలు తెప్పించిన ఘనత రాజమౌళి ఇదే .. ఆ తర్వాత బాహుబలి 2 తో ఏకంగా ఇండియన్ సినిమా పైన జండా పాతేశారు రాజమౌళి.. ఇక ఆ తర్వాత కేజిఎఫ్ తో అది ఇంకాస్త ముందుకు వెళ్ళింది.


ఇలా రాజమౌళి వేసిన దారిలో ప్రశాంత్ నీల్‌ కూడా ముందుకు వెళ్లారు.. కే జి ఎఫ్ సినిమాలతో బాలీవుడ్ పై దడ పుట్టించారు .  ఆ తర్వాత త్రిబుల్ ఆర్ తో మరోసారి నార్త్ ఆడియన్స్ నాడి పట్టుకున్నారు రాజమౌళి. కాంతారా తో రిష‌బ్ శెట్టి , కార్తికేయ 2తో చందు మొండేటి సైతం హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు .. సాహో , కల్కితో ప్రభాస్ పూర్తిగా బాలీవుడ్ హీరోగా మారిపోయారు. ఇక పుష్ప 2 1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టారు అల్లు అర్జున్ .. ఇలా పాన్ ఇండియా దగ్గర మన దర్శకులకు ఉన్న సక్సెస్ రేట్ మరి ఎవరికీ లేదు .. కంగువా, తంగలాన్, పొన్నియన్ సెల్వన్  వంటి సినిమాలు పాన్ ఇండియ‌ స్థాయిలో ఆకట్టుకోలేదు .. అయితే ఇక్కడ ఉన్నంతలో కన్నడ పరిశ్రమ కాస్త బెటర్ .. ఇక్కడ ఎలా చూసుకున్నా పాన్ ఇండియా సినిమాలను తమ గుప్పెట్లో పెట్టుకున్నది టాలీవుడ్ డే .. తర్వాత కూడా స్పిరిట్ , రాజా సాబ్ , దేవరా 2.. ఇలా వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: