
గత సంవత్సరం నా సామిరంగా అంటూ నాగార్జున వచ్చారు ఆ తర్వాత ఇప్పటివరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు. అలాగే చాలామంది దర్శకుల పేర్లు వినిపించిన ఎలాంటి కన్ఫర్మ్ కాలేదు .. అయితే ఈ గ్యాప్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే బాగానే చేస్తున్నారు . గత ఏడాది బ్రహ్మాస్త్రలో చేసినట్టే తాజాగా ఇప్పుడు రెండు సినిమాల్లో చేస్తున్నారు. శేఖర్ కమ్ముల , ధనుష్ కాంబోలో వస్తున్న కుబేరలో కీలకపాత్రలో నటిస్తున్నారు నాగార్జున .. అలాగే రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ కూలీలోను కీలక రోల్ చేస్తున్నారు నాగార్జున .. వీటితోపాటు బిగ్ బాస్ షో కూడా చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ బిజీలో పడి సొలో హీరోగా సినిమా అనౌన్స్ చేసే టైం లేకుండా పోయింది నాగార్జునకు .. చాలాకాలంగా సరైన కథ కోసం ఎదురుచూస్తున్నారు ఈ సీనియర్ హీరో .. సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే సోలో హీరో గాను నటించడానికి సరైన స్టోరీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఈ సీనియర్ హీరోకి నవీన్ అనే తమిళ దర్శకుడు చెప్పిన కథ నచ్చిందని తెలుస్తుంది .. అన్ని ఓకే అయితే నాగార్జున నెక్స్ట్ సినిమా ఈ దర్శకుడు తోనే అని అంటున్నా .. టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలు చిరంజీవి , బాలయ్య , వెంకటేష్ కూడా ప్రెసెంట్ యంగ్ దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు .. అదే రూట్ ను కంటిన్యూ చేయాలని నాగార్జున కూడా ప్లాన్ లో ఉన్నాడు.