ప్రతి ఇండస్ట్రీలో సినిమా సినిమాకు కొత్త అందం పరిచయమవుతుంది .. కానీ ఎలాంటి లాభం ? ఒక్కరు కూడా విజయం అందుకు కావట్లేదు .. అందుకే స్టార్ హీరోలకు ఈ హీరోయిన్ల తిప్పలు . కానీ ప్రజెంట్ ఇవి తీరిపోయేలా కనిపిస్తున్నాయి .. మరో రెండు సంవత్సరాల వరకు హీరోయిన్ కష్టాలు ఉండకపోవచ్చు .. చాలామంది ముద్దుగుమ్మలు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు .. మరి ఇండస్ట్రీకి వస్తున్న కొత్త హీరోయిన్లు ఎవరు ..? కొత్త భామలు రావడం కాదు .. వచ్చినవాళ్లు విజయం సాధించినప్పుడే హీరోయిన్ల కష్టాలకు కొంత వెసులుబాటు ఉంటుంది ..


అదే జరిగేలా కనిపిస్తుంది .. మిస్టర్ బచ్చన్ తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే .  మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారిపోయారు .. రామ్ పోతినేని , విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సినిమాల్లో భాగ్యశ్రీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది .. ఇలా ఓ సెక్షన్ ఆఫ్ హీరోలకు కొన్ని సంవత్సరాలు పాటు హీరోయిన్ కష్టాలు తీరిపోయినట్లే. ఇక మరో పక్క ప్రభాస్ , హను రాఘవపూడి సినిమాతో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు .. తొలి సినిమా రిలీజ్ కు ముందు ఇమాన్వి గురించి బాగా హాట్ టాపిక్ గా చర్చ జరిగింది .. ఫౌజీ హిట్టైతే .. ఇమాన్వి రేంజ్ మరింత పెరగటం కాయం. అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు రుక్మిణి వసంత్ ..


ఇప్పటికే కన్నడలో ఈమె స్టార్ హీరోయిన్ .. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ తో నటించే అవకాశం రావడంతో .. రుక్మిణి వైపు అందరూ చూపు పడింది .. రీసెంట్ గానే నిఖిల్ హీరోగా నటించిన అప్పుడు ఇప్పుడు ఎప్పుడో సినిమాలో నటించారు .. కానీ అది వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియదు. ఇదేక్ర‌మంలో గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న హీరోయిన్ కయాడు లోహర్ ... ప్రదీప్ రంగనాథన్‌ డ్రాగన్ లో ఈమె నటించారు .. గ్లామర్ షోకు ఎలాంటి హద్దులు లేవు దాంతో కయాడు లోహర్ పేరు హాట్ టాపిక్ గా మారింది. అలాగే విశ్వక్ అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీలో కయాడు లోహర్ ను హీరోయిన్గా తీసుకుంటున్నారు .. ఇలా మొత్తానికి ఈ హీరోయిన్స్‌ అంతా క్లిక్ అయితే కొన్ని సంవత్సరాలు పాటు హీరోయిన్లు కష్టాలు ఇండస్ట్రీలో తీరునట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: