
ఏపీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని మీనాక్షి చౌదరిని కోరింది చంద్రబాబు నాయుడు సర్కార్. అయితే ఏపీ ప్రభుత్వం కోరిక మేరకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో... ఏపీ మహిళా సాధికారిక విభాగానికి బ్రాండ్ అంబాసిడర్ గా మీనాక్షి చౌదరి పని చేయబోతున్నారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయినట్లు చెబుతున్నారు. అధికారిక ఉత్తర్వులు జారీ కాగానే ఆమె బాధ్యతలు కూడా తీసుకోబోతున్నారట.
ఏపీ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించే.. పాత్రలో ఇకపై మీనాక్షి చౌదరి కనిపించబోతున్నారన్నమాట. అయితే... చాలామంది తెలుగు హీరోయిన్లు ఉన్నప్పటికీ మీనాక్షి చౌదరికి ఈ పదవి ఎందుకు ఇచ్చారని కొంతమంది వైసీపీ నేతలు దీనిపై ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హీరోయిన్లు ఉన్నారని.. అందులో ఒకరిని సెలెక్ట్ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.
కానీ హర్యానా రాష్ట్రానికి సంబంధించిన మీనాక్షి చౌదరిని బ్రాండ్ అంబాసిడర్ గా ఎలా నియమిస్తారు ? అంటూ వైసీపీ మండిపడుతోంది. ఏదేమైనా మీనాక్షి చౌదరి పదవి పై ఇప్పుడు.. పెద్ద దుమారమే రేగింది. ఇది ఇలా ఉండగా... హరియానికి చెందిన మీనాక్షి చౌదరి... ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమాతో... తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత కిలాడి, హిట్, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు చేసి దుమ్ము లేపింది.