టాలీవుడ్ లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎప్పుడు కూడా సరికొత్త కథా అంశంతోనే అభిమానులను అలరించడానికి చూస్తూ ఉంటారు. తాజాగా తన 21వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో శరవేగంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. కళ్యాణ్ రామ్ సినిమా విషయంలో ప్రత్యేకించి మరి కేర్ తీసుకుంటారని చెప్పవచ్చు. ఈ చిత్రంలో అలనాటి హీరోయిన్ విజయశాంతి కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నది. అలాగే హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ నటిస్తూ ఉన్నది.


అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషన్ కంటెంట్ పోస్టర్స్ సైతం బాగానే ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమాకి వస్తున్న బజ్  ప్రకారం ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉందని.. ఈ సినిమా అవుట్ ఫుట్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే ఒక బెస్ట్ చిత్రంగా నిలుస్తుందని చిత్ర బృందం నమ్ముతొందట.


దీంతో ఈ విషయం తెలిసిన కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ సైతం ఖుషి అవుతున్నారు. గతంలో అతనొక్కడే, పటాస్, బింబి సార వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకోగా ఇప్పుడు కళ్యాణ్ రామ్ 21వ సినిమా కూడా అంతకంటే ఎక్కువ మాట్లాడుకునేలా చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్ సైతం కాలర్ ఎగరేసేలా ఉంటుందని కూడా తెలుపుతున్నారు. మరి ఏది ఏమైనా ఈ సినిమాకి సంబంధించి టీజర్ విడుదలై ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుంది ,అలాగే ట్రైలర్ తో ఏ విధంగా ఆకట్టుకుంటుంది సినిమా బిజినెస్ ఎలా జరుగుతుందనే విషయం పైన ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మరి రిలీజ్ డేట్ ఎప్పుడో అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: