ప్రభాస్ ..ప్రభాస్..ప్రభాస్ మాటకు ముందు ప్రభాస్ ..మాట వెనక ప్రభాస్ . ఏ సినిమా హిట్ అయిన ప్రభాస్.. ఏ సినిమా ఫ్లాప్ అయినా ప్రభాస్ . ప్రభాస్ అనే  పేరుని ఎక్కువగా జపిస్తున్నారు అభిమానులు . అఫ్ కోర్స్ ప్రభాస్ కి ఒక స్టార్ డమ్ ఉంది. అయితే కొంతమంది జనాలు మాత్రం 24/7 ప్రభాస్ .. ప్రభాస్.. ప్రభాస్ అంటూ జపిస్తూనే ఉంటారు . అది ప్రభాస్ పై వాళ్ళకుండే వీరాభిమానం అనే చెప్పాలి . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది డైహార్ట్ రెబల్ ఫ్యాన్స్ ప్రభాస్ ని ఓ కోరిక కోరుతున్నారు .


ప్రభాస్ నువ్వు ఎంతో ఎంతో మంది డైరెక్టర్లకు ఛాన్స్ లు ఇస్తున్నావ్.. హిట్ అయిన ఫట్ అయిన మేము ఏమీ ఆలోచించం . కానీ ఒక్క డైరెక్టర్ తో సినిమా చేయి ప్రభాస్ . ఆ డైరెక్టర్ కి సినిమా అవకాశం ఇవ్వు ప్రభాస్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఓపెన్ గానే ఆ డైరెక్టర్ పేరుని ప్రస్తావిస్తున్నారు.  ఆయన మరెవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఎన్నో అసాధారణమైన కాంబోలను కూడా సుసాధ్యం అంటూ ప్రూవ్ చేశారు.



అయితే త్రివిక్రమ్ శ్రీనివాసరావు - ప్రభాస్ కాంబోలో సినిమా రావాలి రావాలి అంటూ వెయిట్ చేస్తున్నారు జనాలు . కానీ ఆ కాంబో ఎందుకో సెట్ అవ్వడం లేదు. ఈ క్రమంలోనే రెబల్ ఫ్యాన్స్ ఓపెన్గానే ప్రభాస్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు . ఎంతోమంది డైరెక్టర్స్ కి అవకాశం ఇస్తున్న నువ్వు ఒక్కసారి మా మాట మాత్రమే విని త్రివిక్రమ్ కి ఛాన్స్ ఇవ్వరాదు . కచ్చితంగా ఆ కాంబో ని మేము ఎంజాయ్ చేస్తాం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు . మరి చూడాలి ప్రభాస్ తన ఫ్యాన్స్ సజెషన్స్ ని రిక్వెస్ట్ ని ఏ మాత్రం తీసుకుంటాడో . ప్రభాస్ ప్రెసెంట్ అయితే పలు పాన్ సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్ళిపోతున్నాడు . అంతే కాదు రీసెంట్ గా  రిలీజ్ అయిన కన్నప్ప టీజర్ లో ప్రభాస్ లుక్స్ హైలెట్  గా అనిపించాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: