
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ .. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కు తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు ఫౌజీ అనే టైటిల్ దాదాపు ఫిక్స్ అయిపోయినట్టే. ఈ సినిమా ను పీరియాడిక్ వార్ అండ్ లవ్ స్టోరీగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా లో ఇప్పటి వరకు ప్రభాస్ ఒక్కడు మాత్రమే ఉంటాడని అందరూ అనుకున్నారు. అయితే లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా లో ప్రభాస్ తో పాటు మరో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడట. ఇక ఫౌజీ సినిమా సెకండ్ హాఫ్ లో ఈ పాత్ర సినిమాలోనే ముఖ్యమైన పాత్ర అవుతుందట. ఈ సినిమా కథకు అనుగుణంగా నే దర్శకుడు సన్ని డియోల్ పాత్ర డిపరెంట్ గా తీర్చిదిద్దాడట. కాగా ఫౌజీ సినిమా లో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఆలియా భట్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె యువరాణి పాత్రలో కనిపిస్తారని సమాచారం.
ఇక సన్ని డియోల్ మన తెలుగు దర్శకుడు మలినేని గోపీచంద్ దర్శకత్వం లో జాట్ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని .. అలాగే ఈ ఫౌజీ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడని సమాచారం. సెంట్ గా అనుపమ్ ఖేర్ ఫౌజీ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. అలాగే, ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది.