- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నంద‌మూరి న‌టసింహం బాలయ్యబోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు ఒక దానిని మించి మ‌రొక‌టి సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ముందుగా సింహా ఆ త‌ర్వాత లెజెండ్‌.. ఆ త‌ర్వాత అఖండ వ‌చ్చి హిట్ అయ్యాయి. వీరి కాంబో లో చివ‌ర‌గా వ‌చ్చిన ‘ అఖండ ’  సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో  అఖండ సినిమాకు సీక్వెల్ గా వ‌స్తోన్న ‘ అఖండ 2 – తాండవం ’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతానికి అయితే శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హిమాలయాల్లో అద్భుతమైన లొకేష‌న్ల కోసం ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ నుతో పాటు ఆయ‌న టీం అన్వేష‌ణ లో ఉంది.


గతంలో ఏ సినిమాలో చూడనటువంటి ప్రదేశాల్లో కొన్ని అసాధారణ సన్నివేశాలను షూట్ చేసేలా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ సన్నివేశాల్లో బాలయ్యతో పాటు జగపతి బాబు, అలాగే విలన్ పాత్రధారి కూడా పాల్గొంటారని స‌మాచారం. ఆది పినిశెట్టిసినిమా లో బాల‌య్య‌ను ఢీ కొట్టే విల‌న్ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట‌. హిమాల‌యా ల షెడ్యూల్ పూర్త‌య్యా క హైద‌రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో వేస్తున్న ప్రత్యేక సెట్ లో కొన్ని స్పెషల్ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా ను రు. 180 కోట్ల భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కు ఓవ‌రాల్ గా రు. 200 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతుంద‌న్న అంచనాలు అయితే టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: