
పెద్ద హీరో తో సినిమా చేస్తే తమ కెరీర్ కు తిరుగు ఉండదని ఏ దర్శకులు అయినా అనుకుంటారు.. ఇది సహజం. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో తో జీవితం లో ఒక్క సినిమా అయినా చేయాలనా ఆశపడే ... ఆరాట పడే దర్శకులు టాలీవుడ్ లో ఎంతో మంది ఉంటారు. టాలీవుడ్ ఇద్దరు యంగ్ దర్శకులు .. ఓ సీనియర్ దర్శకుడికి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే బంపర్ అవకాశం వచ్చింది. అయితే పవన్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చినప్పుడు ఎగిరి గంతేసిన ఆ దర్శకలు ఇప్పుడు పవన్ తో అవకాశం ఎందుకు వచ్చింది రా బాబు అని తలలు పట్టుకునే వరకు పరిస్థితి వచ్చింది.
ఆ దర్శకులు ఎవరో కాదు హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ - ఓజీ డైరెక్టర్ సుజీత్ - ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్. ఇక క్రిష్ వీరమల్లు సినిమా ను కొంత వరకు లాగారు. ఆ తర్వాత పవన్ కోసం కథ మార్చేశారు.. ఫైట్లు తగ్గించేశారు.. చివరకు క్రిష్ ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లి పోయాడు. ఈ సినిమాను ఇప్పుడు ఆ సినిమా నిర్మాత ఏఎం . రత్నం తనయుడు జ్యోతికృష్ణ సొంతంగా డైరెక్ట్ చేసుకుంటున్నాడు.
ఇక ఓజీ సినిమా అవకాశం వచ్చినప్పుడు సుజిత్ ఎగిరి గంతేశాడు. ఇప్పుడు కాల్షీ ట్లు ఇవ్వక .. మరో సినిమా చేయలేక సుజిత్ ఇబ్బంది పడుతున్నాడు. ఎప్పుడో ఆరేల్ల క్రితం వచ్చిన ప్రభాస్ సాహో సినిమా తర్వాత సుజిత్ కు మరో సినిమా లేదు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అనుకున్నాక పవన్ డేట్లు ఇవ్వక మధ్యలో రవితేజ తో మిస్టర్ బచ్చన్ పూర్తి చేశాడు హరీష్ శంకర్. ఇలా పవన్ దర్శకులు బాధలు అన్నీ ఇన్నీ కావు అన్నట్టుగా ఉంది.