
అయితే మరో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి జక్కన్న దారిలో నడుస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అనిల్ రావిపూడి ఒక సందర్భంలో మాట్లాడుతూ ఎవరితో చేస్తానో తెలీదు కానీ నాకు కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందని ఆయన కామెంట్లు చేశారు. మహాభారతం బ్యాక్ డ్రాప్ లో అద్భుతంగా ఒక మైథలాజికల్ సినిమా చేయాలని ఉందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.
మహా భారతం నుంచి ఏదో ఒక బ్లాక్ పట్టుకుని సినిమా చేయాలని ఉందని అయితే ఎప్పుడు చేస్తానో మాత్రం తెలియదని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. రాజమౌళి మహాభారతంను తెరకెక్కించాలని భావిస్తుండగా అనిల్ రావిపూడి మహా భారతంలోని ఒక బ్లాక్ ను తెరకెక్కించాలని భావిస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.
అనిల్ రావిపూడి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా సీనియర్ హీరోలంతా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. అనిల్ రావిపూడి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. అనిల్ రావిపూడి ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ఈ డైరెక్టర్ కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలు సృష్టించాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.