
ఇ ప్పుడు అల్లు అర్జున్ కి అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా చాలా చాలా ఇంపార్టెంట్ . ఆ కారణం గానే త్రివిక్రమ్ కూడా ఈ విషయాన్ని లైట్ గా తీసుకున్నారట. అంతేకాదు త్రివిక్రమ్ కి కొంచెం టైం దొరకడంతో ఒక లవబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీనీ తెరకెక్కించబోతున్నారట. అది కూడా ఎప్పటినుంచో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్న రాం పోతినేని తో అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఇప్పుడు రామ్ పోతినేని - త్రివిక్రమ్ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . ఈ మధ్యకాలంలో రామ్ పోతినేనికి కూడా పెద్దగా హిట్లు పడలేదు .
ఈ సినిమా హిట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ . కచ్చితంగా త్రివిక్రమ్ తో సినిమా అంటే ఆ సినిమా హిట్ అవ్వాల్సిందే . నో డౌట్ . అయితే వీళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కత్తిలాంటి హీరోయిన్ ఫిక్స్ చేసుకున్నాడు త్రివిక్రమ్ అంటూ ఓ న్యూస్ బాగా సరిక్యులేట్ అవుతుంది. ఆమె మరి ఎవరో కాదు .. ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న మీనాక్షి చౌదరి . మీనాక్షి చౌదరి పేరు ఇప్పుడు ఎలా ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిందే. ఆల్రెడీ గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి నటన ఏంటో చూశాడు త్రివిక్రమ్. ఆ ఆకారణంగానే రామ్ పోతినేని సినిమాలో హీరోయిన్గా పెట్టుకున్నారట . సోషల్ మీడియాలో వీళ్ళ కాంబోకి సంబంధించిన వార్తలు బాగా వైరల్ గా మారిపోయాయి..!